ముంబై హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్‌ని పరామర్శించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 12 , 2026 | 04:23 PM

ముంబైలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

Deputy CM Pawan Kalyan and CM Chandrababu

ముంబైలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ (AP Deputy CM Pawan Kalyan)ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు నాయుడు కోకిలబెన్ ఆసుపత్రికి చేరుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. సీఎం చంద్రబాబు పరామర్శకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ ఆపరేషన్ బెడ్ పక్కన కూర్చుని ఉండగా, చంద్రబాబు ఆయనకు ఎదురుగా కూర్చుని ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఈ ఫొటో తెలియజేస్తోంది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు, జనసైనికులు ఎక్స్ వేదికగా కోరుకుంటున్నారు.


శస్త్ర చికిత్స విజయవంతం

శనివారం పవన్ కళ్యాణ్‌కు ముంబైలో నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయినట్లుగా జనసేన వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టిందని జనసేన వర్గాలు అధికారిక ప్రకటనను విడుదల చేశాయి.


పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ...

పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగడంతో.. నొప్పి కలిగినా ఆయన భరించేవారు. ఇలా పదే పదే జరుగుతుండటంతో ఆయనకు గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు. ఏప్రిల్ నెలలో ఆయన ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

ప్రకాష్ రాజ్‌ని బండ్ల గణేష్ అంత మాట అన్నాడేంటి.. ఈ బ్యాటింగ్ ఏంటి సామి?

‘లెనిన్’ 2 డేస్ కలెక్షన్స్.. అస్సలు ఊహించి ఉండరు

సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్న రష్మిక.. కారణమేంటి?

Updated Date - Jul 12 , 2026 | 05:15 PM