బంగారం నేను కాదు.. సాయిపల్లవి -సమంత
ABN , Publish Date - Jun 06 , 2026 | 09:51 PM
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ సమంత ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత (Samantha), రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి నందినీ రెడ్డి (Nandini Reddy) దర్శకురాలు. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్.. భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో హీరోయిన్ సమంత యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఓ వీడియోలో.. అసలు బంగారం తను కాదని, సాయిపల్లవి (Sai Pallavi) అని తెలిపారు. అసలు వీడియోలో సమంత ఏం తెలిపారంటే..
‘‘నిజానికి ఈ సినిమాను నేను సెలెక్ట్ చేసుకోలేదు.. ఈ సినిమానే నన్ను సెలెక్ట్ చేసుకుంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ముఖ్య ఉద్దేశం ఎప్పుడూ కూడా మహిళా ప్రాధాన్యత ఉన్న కథలపైనే దృష్టి పెట్టడం. ఈ సినిమాకు సంబంధించిన మొదటి మేమంతా సాయిపల్లవిని అనుకున్నాం. ఈ కథని ఆమెకి చెప్పి, ఇందులో నటింపజేయాలని అనుకున్నాం. కానీ ఆమె చాలా చాలా బిజీగా ఉండటంతో, ఈ సినిమాకు ఆమె డేట్స్ కేటాయించలేదని మాకు తెలిసింది.
దీంతో ఈ కథని నేనే చేయాల్సి వచ్చింది. నాకోసమని ఈ కథను కొద్దిగా మార్చారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా బాగా వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో మరికొంతమంది మహిళా నటీమణులు మా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై నమ్మకంతో మాతో కలిసి పనిచేస్తారని నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘మా ఇంటి బంగారం’ విషయానికి వస్తే.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీలో.. దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు.
ఇవి కూడా చదవండి:
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!
ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!
సినిమా రివ్యూ: హీమాన్ అండ్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్