‘రోమియో జూలియట్’ రిలీజ్ వాయిదా.. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం హీరో హర్షిత్ కాంప్రమైజ్!
ABN, Publish Date - Oct 17 , 2026 | 02:59 PM
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న విడుదల కావాల్సిన ‘రోమియో జూలియట్’ సినిమా వారం వాయిదా పడింది. ప్రభాస్ నటించిన ‘వర్షం’, ‘ఛత్రపతి’ రీ-రిలీజ్‌ల నేపథ్యంలో అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన సినిమా 'రోమియో జూలియట్'. అక్టోబర్ 23న విడుదల కావాల్సిన ఈ సినిమాను 30వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఆసక్తికరంగా సాగింది. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని హీరో హర్షిత్ తెలుపగా, ఆ రోజున అప్పటికే ప్రభాస్ సినిమాలు రెండు రీ-రిలీజ్ అవుతున్నామని, తాము ఆ సినిమాలు చూడటానికే ప్రాధాన్యం ఇస్తామని ప్రభాస్ అభిమానులు చెబుతారు. వారు చెప్పేది నిజమే... ఎందుకంటే అక్టోబర్ 23న ప్రభాస్ నటించిన 'వర్షం, ఛత్రపతి' సినిమా రీ-రిలీజ్ అవుతున్నాయి. దాంతో హీరో హర్షిత్ కాంప్రమైజ్ అవుతూ అయితే ప్రభాస్ అన్న బర్త్ డే మంత్ ఎండ్ లో తమ సినిమా 'రోమియో జూలియట్'ను జనం ముందుకు తీసుకొస్తామని చెబుతారు. అది బెటర్ అని ప్రభాస్ అభిమానులు అంటారు. అలా... ఈ సినిమా రిలీజ్‌ను ఓ వారం పాటు వాయిదా వేసినట్టు మేకర్స్ ప్రకటించారు.
యూత్‌ఫుల్ జన్ జీ లవ్ డ్రామా 'రోమియో జూలియట్'ను భార్గవ్ మాచర్ల డైరెక్ట్ చేశారు. వైవా హర్ష, సిరి హనుమంత్, ప్రసాద్ బెహరా, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, అజయ్ కీలక పాత్రలు పోషించారు. సందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుత జెన్ జీ తరం ప్రేమను, రిలేషన్‌షిప్స్‌ను, గొడవలు, బ్రేకప్స్‌ను ఎలా చూస్తోంది? సిట్యుయేషన్షిప్స్, సోషల్ మీడియా, పబ్లిక్ బ్రేకప్స్, మారుతున్న రిలేషన్షిప్ అంశాలు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతను టార్గెట్ చేస్తూ.. వాళ్లకు తెలిసిన భాష, రిలేషన్షిప్ డైనమిక్స్‌తో ఈ కథను తెరకెక్కించారు. బోల్డ్ ప్రిమైజ్, కాంటెంపరరీ ట్రీట్మెంట్తో విడుదలైన ఈ స్టోరీ రివీల్ గ్లింప్స్ ఇప్పటికే ఆన్లైన్లో ఆసక్తిని పెంచుతోంది. ‘రోమియో జూలియట్’కు భార్గవ్ మాచర్ల, ప్రశాంత్ రాఘతి కథ అందించగా, గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?
‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
కావ్య మారన్‌తో పెళ్లి.. తెలుగువాళ్లకి అనిరుధ్ మరింత దగ్గర కాబోతున్నాడా?