రవితేజ ‘కృష్ణ’ రీ రిలీజ్.. ఆసక్తికర విషయం చెప్పిన వినాయక్
ABN, Publish Date - May 02 , 2026 | 09:20 PM
మాస్ మహారాజా రవితేజ, త్రిష కాంబినేషన్‌లో.. మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ రూపొందించిన చిత్రం ‘కృష్ణ’. ఈ సినిమా విడుదలై 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడీ సినిమా రీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), త్రిష (Trisha) కాంబినేషన్‌లో.. మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ (VV Vinayak) రూపొందించిన చిత్రం ‘కృష్ణ’ (Krishna). ఈ సినిమా విడుదలై 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని రీ రిలీజ్‌కు తీసుకువస్తున్నారు. మే 8న ఈ చిత్రం రీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు వి.వి. వినాయక్ తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంటూ, ఈ సినిమా సెట్ కావడానికి కారణం ఎవరో తెలిపారు.
‘‘రవితేజతో నేను చేసిన ‘కృష్ణ’ సినిమా రీ రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిత్ర నిర్మాత, నా స్నేహితుడు బుద్ధా కాశీ విశ్వనాథం, అలాగే చిత్ర సమర్పకులు డి.వి.వి దానయ్యకు థ్యాంక్స్ చెబుతున్నాను. ‘కృష్ణ’ సినిమా విడుదలై 18 ఏళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ఒక సెన్సేషనల్ హిట్.. ఆ రోజుల్లో మంచి పేరు తెచ్చిన సినిమా ఇది. ఈ సినిమా గురించి ఓ విషయం పంచుకోవాలి. ఈ సినిమా జరగడానికి ముఖ్య కారణం రాజా రవీంద్ర. తనే ఈ ప్రాజెక్ట్ సెట్ చేశాడు. థ్యాంక్యూ రాజా.
అలాగే ఈ సినిమా చాలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా, చక్కగా జరగడానికి కారణం రవితేజ. ఆయన పడ్డ కష్టం, ఆయన చేసిన కామెడీ ఈ సినిమాకు హైలెట్. అలాగే బ్రహ్మానందం, మిగతా కాస్టింగ్ అందరికీ అప్పట్లో మంచి పేరు వచ్చింది. మా టీమ్ అందరికీ ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్యూ. మళ్ళీ 18 ఏళ్ల తర్వాత రఘురామరెడ్డి ఈ సినిమాను 4K హై రెజల్యూషన్‌లో మే 8న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఆయనకు నా విషెస్ తెలియజేస్తున్నాను. అప్పట్లాగే ఈ సినిమాను మళ్ళీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు’’ అని వినాయక్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. ఫొటోలు వైరల్!
‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?