సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రెమ్యూనరేషనే లేదన్నారు కదరా.. ‘ఇరుముడి’తో రవితేజ భారీ జాక్‌పాట్

ABN, Publish Date - Sep 10 , 2026 | 02:29 PM

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, తన స్వయంకృషితో ‘మాస్ మహారాజా’గా ఎదిగిన నటుడు రవితేజ. హిట్లతో, ఫ్లాపులతో సంబంధం లేకుండా కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోవడం ఆయన శైలి.

Ravi Teja Irumudi Movie

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, తన స్వయంకృషితో ‘మాస్ మహారాజా’గా ఎదిగిన నటుడు రవితేజ (Mass Maharaja Ravi Teja). హిట్లతో, ఫ్లాపులతో సంబంధం లేకుండా కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోవడం ఆయన శైలి. అయితే, ఇటీవల బాక్సాఫీస్ దగ్గర ఆయనకు దక్కిన అతిపెద్ద విజయం.. ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, రవితేజ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుండటం ‘ఇరుముడి’ మేనియాకి నిదర్శనం.

ఇక ‘ఇరుముడి’ సినిమాకు ముందు రవితేజ గురించి రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఆయన పని అయిపోయిందని యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. మరికొందరు అయితే.. ఈ సినిమాకు రవితేజ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదనేలా టాక్ వైరల్ చేశారు. ఎన్ని మాటలు వచ్చినా.. రవితేజ మాత్రం వెనుకడుగు వేయలేదు. తన పని తను చేసుకుంటూనే వెళుతున్నారు. ఇక ‘ఇరుముడి’ సినిమా సాధించిన ఈ భారీ విజయం రవితేజకు గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు, ఆర్థికంగానూ ఊహించని స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం సినీ వర్గాల్లో రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ డీల్ గురించే హాట్ టాపిక్‌గా చర్చ సాగుతోంది.


మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. సాధారణంగా హీరోలు ఒకేసారి ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ, రవితేజ ఈ సినిమా కోసం సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు. ట్రేడ్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం రవితేజ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రూ. 8 కోట్ల డైరెక్ట్ రెమ్యునరేషన్‌తో పాటు, నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను పారితోషికంలో భాగంగా తీసుకున్నారట. సినిమా విడుదలకాకముందు, నైజాం థియేట్రికల్ హక్కుల విలువ సుమారు రూ. 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. సాధారణంగా జరిగే బిజినెస్ లెక్క ప్రకారం ఇది ఒక నార్మల్ డీల్‌లాగే కనిపించింది. కానీ, ‘ఇరుముడి’ థియేటర్లలోకి వచ్చాక బాక్సాఫీస్ సెన్సేషన్ అయ్యేసరికి ఆ రైట్స్ విలువ ఊహించని విధంగా భారీగా పెరిగిపోయింది. తాజా రిపోర్టుల ప్రకారం, నైజాం ఏరియాలో ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ. 53.76 కోట్ల షేర్ సాధించి రికార్డు సృష్టించింది. అంతేకాదు, ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మొత్తం దాదాపు రూ. 60 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.


ఇప్పుడు జీఎస్టీ మినహాయించిన తర్వాత నైజాం షేర్ సుమారు రూ. 50.95 కోట్లకు చేరుతుందని సినీ వర్గాలు లెక్కలేస్తున్నాయి.ఈ మొత్తంలో నుంచి సుమారు రూ. 1.10 కోట్ల ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్‌కు ఇవ్వాల్సిన 5 శాతం కమిషన్ మినహాయిస్తే.. మాస్ మహాజా రవితేజకి ఒక్క నైజాం ఏరియా నుంచే సుమారు రూ. 47.5 కోట్ల నికర లాభం దక్కే అవకాశం కనిపిస్తోందట. ఒకవేళ రవితేజకి కంప్లీట్ రెమ్యునరేషన్‌గా సుమారు రూ. 25 కోట్లు ఇచ్చి ఉంటే డీల్ అక్కడితో పూర్తయిపోయేది. కానీ, పారితోషికంలో భాగంగా నైజాం రైట్స్ తీసుకోవడం వల్ల ఆయనకు వచ్చిన మొత్తం అమాంతం పెరిగిపోయింది. అంటే.. రూ. 8 కోట్ల రెమ్యునరేషన్, ప్లస్ నైజాం ప్రాఫిట్ కలిపితే రవితేజకి ఈ సినిమా నుంచి దక్కిన పారితోషికం ఒక రేంజ్‌లో ఉందన్నమాట. ఈ డీల్ రవితేజ కెరీర్‌కే అతిపెద్ద జాక్‌పాట్‌గా మారింది. అయితే, ఈ రెమ్యునరేషన్, షేర్ ప్రాఫిట్స్ లెక్కలపై మైత్రి మూవీ మేకర్స్ గానీ, రవితేజ టీమ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

‘అ’ బ్లడీ హంగర్‌ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే

‘రాకా’లో విల్ స్మిత్ ఊరమాస్ అవతార్.. లీక్డ్ పిక్ వైరల్

జయం రవి బర్త్‌డే స్పెషల్.. ‘వడ్డీ కాసులవాడ’ న్యూ పోస్టర్ వైరల్

Updated Date - Sep 10 , 2026 | 02:29 PM