‘అ’ బ్లడీ హంగర్‌ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే

ABN , Publish Date - Sep 10 , 2026 | 01:55 PM

రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటోన్న ‘అ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ వదిలారు.

Ah Glimpse

రాహుల్ విజయ్ (Rahul Vijay), అర్చన అయ్యర్ (Archana Iyer) హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటోన్న ‘అ’ (Ah) సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో.. తాజాగా ‘బ్లడీ హంగర్’ పేరుతో ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. డెబ్యూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతోన్న ఈ థ్రిల్లర్‌ చిత్రానికి కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.


డైలాగ్స్ లేకుండా రూపొందించిన ఈ గ్లింప్స్.. భయంకరమైన విజువల్స్, ఆసక్తికరమైన కథనంతో మొదటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. యువతుల అదృశ్యానికి సంబంధించిన ఓ ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ సాగనున్నట్లుగా ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. అదే సమయంలో చీకటిలో పనిచేస్తున్న ఓ మిస్టీరియస్ దుష్టశక్తిని కూడా పరిచయం ఇందులో పరిచయం చేశారు. ఆకట్టుకునే విజువల్స్, షార్ప్ ఎడిటింగ్, సస్పెన్స్‌తో కూడిన నెరేషన్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ‘అమ్మాయి’, ‘అదృశ్యం’, ‘అన్వేషణ’ అనే పదాలను ఉపయోగిస్తూ సినిమా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే విషయం తెలియజేయడంతో ఈ గ్లింప్స్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. శ్రీచరణ్ పాకాల అందించిన థంపింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. హైలెట్ అనేలా ఉంది.


రాహుల్ విజయ్‌ను ఓ సీన్సియర్‌ పోలీస్ ఆఫీసర్‌ రోల్ పోషించారు. ఇన్వెస్టిగేషన్ డ్రామాలో ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అర్చన అయ్యర్ కనిపించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు మిస్టరీని మరింత పెంచుతున్నాయి. ఇక చివరిలో వచ్చే చిల్లింగ్ రివీల్.. అసలు కథ ఏమిటనే ఆసక్తిని ప్రేక్షకుల్లో పెంచుతోంది. ఈ సినిమాకు మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అభినవ్ వి. కూనపరెడ్డి, గ్యారీ BH ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిస్టరీ, ఎమోషన్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో కూడిన డార్క్ థ్రిల్లర్‌గా ‘అ’ తెరకెక్కుతున్నట్లు ఈ గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేసింది. ఇకపై ప్రమోషన్స్‌ విషయంలో స్పీడ్ పెంచనున్నట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

‘రాకా’లో విల్ స్మిత్ ఊరమాస్ అవతార్.. లీక్డ్ పిక్ వైరల్

జయం రవి బర్త్‌డే స్పెషల్.. ‘వడ్డీ కాసులవాడ’ న్యూ పోస్టర్ వైరల్

200 కోట్ల నుంచి 30 కోట్లకు పతనం.. ‘టాక్సిక్’కు దెబ్బ మీద దెబ్బ

Updated Date - Sep 10 , 2026 | 01:55 PM