‘రాకా’లో విల్ స్మిత్ ఊరమాస్ అవతార్.. లీక్డ్ పిక్ వైరల్
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:19 PM
భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లలో ‘రాకా’ అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా నిలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ విజువల్ వండర్ చుట్టూ ఇప్పటికే ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లలో ‘రాకా’ (Raaka) అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా నిలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ విజువల్ వండర్ చుట్టూ ఇప్పటికే ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి హాలీవుడ్ లెజెండరీ స్టార్ విల్ స్మిత్ కూడా ఓ కీలక, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారంటూ గత కొద్దిరోజులుగా అంతర్జాతీయ సినీ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో సినిమా సెట్స్ నుంచి లీక్ అయినట్లుగా భావిస్తున్న ఒక బిహైండ్-ది-సీన్స్ పిక్ సోషల్ మీడియాలోకి ప్రత్యక్షమై ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తోంది. కెమెరా మానిటర్ వెనుక నుంచి తీసినట్లుగా ఉన్న ఈ పిక్‌లో విల్ స్మిత్ కనిపించిన తీరు సినీ ప్రేమికులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ఈ లీక్డ్ ఫోటోలో విల్ స్మిత్ (Will Smith) భయంకరమైన ట్రైబల్ వారియర్ అవతారంలో దర్శనమిచ్చారు. ఒంటిపై దట్టమైన జంతువుల చర్మపు రోమాలతో కూడిన దుస్తులు, యుద్ధంలో తగిలిన గాయాలు, నల్లటి లోహపు కవచం, మెడలో ప్రత్యేకమైన లాకెట్లతో ఆయన కనిపించిన లుక్ పిచ్చెక్కించేలా ఉంది. మరీ ముఖ్యంగా ఎద్దు.. లేదంటే అడవి జంతువు పుర్రెతో తయారుచేసిన భయంకరమైన సింహాసనం పై అంతే భయాకనకంగా కూర్చున్న ఆయన చూపులు పూర్తిస్థాయి క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ స్థాయి హాలీవుడ్ యాక్షన్ ప్యాక్డ్ లుక్‌లో విల్ స్మిత్‌ను చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.
ఒకవేళ ఈ ప్రచారమే నిజమైతే, ఈ పిక్ నిజమైతే మాత్రం.. ‘రాకా’కు ఇక తిరుగులేదనే చెప్పాలి. ఒకవైపు భారతీయ బాక్సాఫీస్ సునామీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మరోవైపు గ్లోబల్ సూపర్ స్టార్ విల్ స్మిత్ వెండితెరపై నేరుగా తలపడితే థియేటర్లలో రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడానికే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని అత్యంత క్రేజీ, హై-వోల్టేజ్ ఫేస్-ఆఫ్‌గా ఈ పోరు నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బీటీఎస్ పిక్ ఎక్స్‌ట్రీమ్ వైల్డ్‌గా దూసుకుపోతూ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మరి ఈ సంచలన కలయికపై చిత్రబృందం ఎప్పుడు అధికారిక ప్రకటన విడుదల చేస్తుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
జయం రవి బర్త్‌డే స్పెషల్.. ‘వడ్డీ కాసులవాడ’ న్యూ పోస్టర్ వైరల్
200 కోట్ల నుంచి 30 కోట్లకు పతనం.. ‘టాక్సిక్’కు దెబ్బ మీద దెబ్బ
15 ఏళ్లుగా నాలో దాచుకున్న ఆవేదన, ఎమోషన్ ఇది: ఉదయభాను