హ్యాట్రిక్ కాంబో రిపీట్.. మరో భారీ మాస్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్!
ABN, Publish Date - Sep 13 , 2026 | 06:31 PM
టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకి ఉండే క్రేజ్, రేంజ్ వేరు. అలాంటి ఒక కలయిక అనౌన్స్ అయితే చాలు.. సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే సగం హిట్ కొట్టేసినంత పబ్లిసిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లకి ఉండే క్రేజ్, రేంజ్ వేరు. అలాంటి ఒక కలయిక అనౌన్స్ అయితే చాలు.. సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే సగం హిట్ కొట్టేసినంత పబ్లిసిటీ వచ్చేస్తుంది. అలాంటి పవర్‌ఫుల్ కాంబినేషనే మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) - డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni). వీరిద్దరి ప్రయాణం ‘డాన్ శీను’తో మొదలైంది. ఆ చిత్రంతోనే గోపీచంద్ మలినేని దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వచ్చిన ‘బలుపు, క్రాక్’ సినిమాలతో ఈ కాంబో ఏకంగా హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఈ ఇద్దరి తోడుకి అదనపు బలం మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్. ‘డాన్ శీను’ మినహా ‘బలుపు’, ‘క్రాక్’ చిత్రాలకు థమన్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాల విజయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబో నాలుగోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది.
ఇటీవలే ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంతో మాస్ మహారాజా బాక్సాఫీస్ దగ్గర రాంపేజ్ సృష్టించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఏకంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికీ కొన్ని సెంటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుందంటే ‘ఇరుముడి’ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రవితేజ వరుసగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు లైన్‌లో పెట్టారు. ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో ‘దాగుడుమూతలు దండాకోర్’ చిత్రంలో ఆయన నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ లాంటి వైవిధ్యమైన చిత్రాలు అందించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా రవితేజ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరోవైపు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన నందమూరి బాలకృష్ణతో ‘దాదా’ అనే భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ తర్వాత బాలయ్య - గోపీచంద్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘దాదా’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ‘దాదా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే గోపీచంద్ మలినేని దృష్టి రవితేజ సినిమాపైనే ఉండబోతోంది.
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 2027 వేసవిలో రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు సమాచారం. మాస్ మహారాజా ఎనర్జీ, గోపీచంద్ మలినేని మాస్ మేకింగ్, దానికి తోడు థమన్ ఇచ్చే పవర్‌ఫుల్ మ్యూజిక్ అండ్ బీజీఎం... ఈ ముగ్గురు మళ్లీ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావాల్సిందే. హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబో, నాలుగో సినిమాతో ఎలాంటి బెంచ్‌మార్క్ రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
‘మండాడి’ బ్లాక్ బస్టర్ హిట్టని ముందే చెప్పారు: సూరి
‘పిఠాపురంలో.. అలా మొదలైంది’.. క్లైమాక్స్ సీన్‌కు కంటతడి పెట్టాల్సిందే!
ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్.. ట్విస్ట్ ఏంటంటే?