‘మండాడి’ బ్లాక్ బస్టర్ హిట్టని ముందే చెప్పారు: సూరి
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:37 PM
ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మదిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మదిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’ (Mandaadi). ఎల్రెడ్ కుమార్ (Elred Kumar) నిర్మించిన ఈ మూవీలో సూరి (Soori), సుహాస్ (Suhas), మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని, థియేటర్లలో దూసుకెళుతోంది. దీంతో మేకర్స్ తమ సంతోషాన్ని తెలియజేసేందుకు యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సూరి మాట్లాడుతూ.. ‘మండాడి’ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కు థాంక్స్. మైత్రి నిర్మాతలు నవీన్, రవి.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ఈ మూవీని చూసి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పారు. అన్ని భాషల్లో ఈ సినిమాకు మంచి సక్సెస్ వచ్చింది. మదిమారన్‌కు, ఎల్రెడ్‌కు థాంక్స్. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా తమ్ముడు సుహాస్‌కు థాంక్స్. ‘మండాడి’కి తమిళంతో పాటుగా తెలుగులోనూ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన మైత్రి నిర్మాతలకు, శశి సార్‌కి థాంక్స్. మా మీద ప్రేమను చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ అని అన్నారు. సుహాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. మైత్రీ నవీన్‌తో కలిసి ఈ మూవీని చూశాను. సినిమా చూసిన రోజే బ్లాక్ బస్టర్ అని చెప్పారు. మేం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. సూరి అన్న ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. మహిమ గురించి, రవింద్ర గురించి అందరూ చెబుతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మదిమారన్‌కు, సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్ అని చెప్పారు.
మైత్రి నిర్మాతలు నవిన్, రవి మాట్లాడుతూ.. ‘మండాడి’ చూసిన వెంటనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మాము. ఎనిమిది నెలల క్రితం ఓ బిజినెస్ కట్ చూశాం. వెంటనే శశిని పంపించి బిజినెస్ క్లోజ్ చేశాం. అప్పటికి మూవీ ఇంకా పూర్తి కాలేదు. ఈ మూవీ హిట్ అవుతుందని సుహాస్‌కి కూడా ముందే చెప్పాను. సూరి స్క్రిప్ట్ సెలెక్షన్ అద్భుతంగా ఉంటుంది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉండబోతోన్నాయి. టీం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. ‘మండాడి’ని అందరూ థియేటర్లో చూడండని అన్నారు. చిత్ర దర్శకుడు మదిమారన్ పుగళేంది (Mathimaran Pugazhendi) మాట్లాడుతూ.. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు సెలెబ్రేట్ చేస్తున్నారు. అన్ని చోట్లా మా మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకి భాషా హద్దులు, సరిహద్దులు ఉండవని మరోసారి ఆడియెన్స్ నిరూపించారని పేర్కొన్నారు.
నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మండాడి’ కంటెంట్ ఓరియెంట్ సినిమా. ఇలాంటి చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తారని మాకు ముందే తెలుసు. ప్రతీ చోట నుంచి మాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లంతా సంతోషంగా ఉన్నారు. నా ‘రంగం’ చిత్రంలానే ‘మండాడి’కి మంచి ఆదరణ దక్కుతోంది. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మైత్రి టీంకు థాంక్స్. మదిమారన్ ఈ మూవీని గొప్పగా తీశారు. సూరి, సుహాస్, మహిమతో పాటు ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరూ మాకు సపోర్ట్ చేశారు. వారందరికీ, అలాగే ప్రేక్షకులకు ఈ సందర్భంగా థ్యాంక్స్.. అని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మైత్రి శశి, హీరోయిన్ మహిమా నంబియార్, నటుడు రవీంద్ర విజయ్.. సినిమా సక్సెస్ పట్ల తమ సంతోషాన్ని తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
‘పిఠాపురంలో.. అలా మొదలైంది’.. క్లైమాక్స్ సీన్‌కు కంటతడి పెట్టాల్సిందే!
ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్.. ట్విస్ట్ ఏంటంటే?
ఐకాన్ స్టార్ ‘రాకా’ రిలీజ్ పై మళ్లీ సస్పెన్స్..!