సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ravi Teja: ఆ పాత్రలో రవితేజ నిజమేనా.. అభిమానులు ఒప్పుకుంటారా?

ABN, Publish Date - Jun 12 , 2026 | 03:20 PM

మాస్‌ మహారాజా రవితేజ దర్శకుడు శివ నిర్వాణతో ‘ఇరుముడి’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. త్వరలో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని మేకర్స్‌ చెబుతున్నారు.

Ravi Teja

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో ‘ఇరుముడి’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. త్వరలో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఇరుముడి టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. రవితేజకు ఈ చిత్రం పర్ఫెక్ట్‌ కమ్‌బ్యాక్‌ అని అభిమానులు చెబుతున్నారు.

మరో పక్క మాస్‌ మహారాజా తదుపరి చిత్రం గురించి చర్చ మొదలైంది. హసిత్‌ గోలి దర్శకత్వంలో రవితేజ నెక్ట్స్‌ సినిమా కమిట్‌ అయ్యారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో రవితేజ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించనున్నారని నెట్టింట వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతకు ముందు హసిత్‌ గోలి శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కించిన ‘శ్వాగ్‌’ సినిమాలో కూడా ట్రాన్స్‌జెండర్‌ల అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడీ చిత్రంలో కూడా రవితేజ పాత్రను అలా ప్రయోగాత్మకంగా చూపించనున్నారని టాక్‌ నడుస్తోంది.


అయితే కొందరు మాత్రం ఇవన్నీ రూమార్స్‌ అని, ఇదొక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా అని, రవితేజ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించడం అవాస్తవమని చెబుతున్నారు. ఈ ఊహాగానాలకు చెక్‌ పడాలంటే చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సిందే! ఇదిలా ఉండగా మరో ఇద్దరు దర్శకులు వశిష్ఠ, వివేక్‌ ఆత్రేయ కూడా రవితేజకు కథలు వినిపించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కథల పరిశీలనలో ఉన్న రవితేజ వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్‌ల గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ALSO READ:

Deva katta: క్లిక్స్ కోసం చేసే పనులవి.. నా పనితో నేను బిజీ 


Chiranjeevi: సంక్రాంతికే.. చిరు బ్లడీ బెంచ్‌ మార్క్‌

Updated Date - Jun 12 , 2026 | 04:10 PM