Deva katta: క్లిక్స్ కోసం చేసే పనులవి.. నా పనితో నేను బిజీ 

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:12 PM

దర్శకుడు దేవ కట్టాపై కొన్ని రోజులుగా పలు రూమర్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే.

Deva Katta

దర్శకుడు దేవ కట్టాపై (Deva Katta) కొన్ని రోజులుగా పలు రూమర్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్‌ కోసం ఓ కథ రెడీ చేస్తున్నారనీ, రాజమౌళి, మహేశ్‌ కాంబోలో వస్తున్న ‘వారణాసి’ చిత్రానికి రైటర్‌గా పని చేస్తున్నారని సోషల్‌ మీడియాలో కొందరు అంటుంటే.. దేవ కట్టా ఇతర చిత్రాలకు తెరవెనుక దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రూమర్స్ కు చెక్‌ పెట్టారు దర్శకుడు దేవ కట్టా. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.


ప్రస్తుతం తన దృష్టంతా తదుపరి సినిమా కథా రచన, ప్రీ-ప్రొడక్షన్‌ పనులకే కేటాయిసున్నట్లు దేవ కట్టా తెలిపారు. 'ముందున్న నా జర్నీ కోసం పని చేస్తున్నాను తప్ప వేరే చిత్రాలకు సింగిల్‌ షాట్‌ డైరెక్ట్‌ చేసిన సందర్భం లేదు. వ్యూస్‌ కోసం, క్లిక్స్‌ కోసం ఏవేవో రాస్తున్నారు. అందుకే తాజాగా వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇవ్వాలనుకున్నా. నేను ఇతర చిత్రాలకు పని చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అభిమానులు ఆ వార్తల్ని నమ్మవద్దు. ప్రస్తుతం నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ చేస్తున్నా. త్వరలో అధికారికంగా వెల్లడిస్తాను’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ప్రకటనతో సోషల్‌ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పడగా, దేవ కట్టా అంబీషియస్‌ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఆయన తదుపరి సినిమా ఏంటి? ఎలాంటి కథతో రాబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.

ALSO READ: Mega158: ‘మెగా158’లో నివేతా పేతురాజ్ లుక్ చూశారా
Devakatta: క్లిక్స్ కోసం చేసే పనులవి.. నా పనితో నేను బిజీ 

Raghava lawrence: కొన్ని కారణాల వల్ల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా..

Updated Date - Jun 12 , 2026 | 03:21 PM