Chiranjeevi: సంక్రాంతికే.. చిరు బ్లడీ బెంచ్ మార్క్
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:04 PM
వాల్తేరు వీరయ్య తర్వాత దర్శకుడు బాబీతో మరోసారి జతకట్టిన మెగాస్టార్ చిరంజీవి మెగా 158 చిత్రాన్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. సంక్రాంతి విడుదల లక్ష్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దశాబ్దాలుగా రికార్డులతో చెడుగుడు ఆడుకుంటున్న మన బాస్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఈ ఏడాది మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో రీజనల్ రికార్డులన్నింటినీ తిరగరాశారు. దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి మెగా స్టార్ స్టామినా ఏంటో చూపించగలిగారు. థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలు వచ్చేలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వచ్చే ఏడాది అంతకు మించి బ్లాక్ బస్టర్ కొట్టడానికి, బాక్సాఫీస్ రికార్డులను తుడిచిపెట్టేయడానికి మెగాస్టార్ రెడీ అవుతున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం!
రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి గారికి అభిమానులు ఏ రేంజ్ కమర్షియల్ సినిమా కోరుకున్నారో, సరిగ్గా అలాంటి బ్లాక్ బస్టర్‌ను వాల్తేరు వీరయ్య చిత్రంతో గిఫ్ట్ ఇచ్చారు డైరెక్టర్ బాబీ (Bobby Kolli). ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రస్తుతం మెగా 158 మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్యతో ఒక ఊచకోత చూశాం.. కానీ ఈ సినిమాతో ఏకంగా ఒక బ్లడీ బెంచ్ మార్క్ సెట్ చేయబోతున్నారని మేకర్స్ ముందే హింట్ ఇచ్చేశారు. ఈ క్యాప్షన్ వింటుంటేనే, సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టైటిల్‌ను ఎనౌన్స్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ టైటిల్ రివీల్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక షూటింగ్ అప్‌డేట్స్ విషయానికి వస్తే.. సినిమాను జెట్ స్పీడ్‌లో పూర్తి చేయడానికి చిత్ర బృందం పక్కా ప్లానింగ్‌తో ఉంది. రీసెంట్‌గా పొల్లాచ్చిలోని అందమైన, సహజ సిద్ధమైన లొకేషన్లలో ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అక్కడ కొన్ని ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో పాటు, కథలో ఎంతో కీలకమైన పలు ఎమోషనల్ సన్నివేశాలను కూడా అద్భుతంగా చిత్రీకరించారట. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా త్వరలో సెకండ్ షెడ్యూల్‌ను కూడా మొదలుపెట్టడానికి మేకర్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
మెగాస్టార్ సినిమా వస్తుందంటేనే పండుగ.. అదే పండుగకు సినిమా వస్తే ఇక బాక్సాఫీస్ దగ్గర జాతరే! సంక్రాంతి (Sankranthi Release) పండుగకు, చిరంజీవి గారి సినిమాలకు ఉన్న సెంటిమెంట్ మనకు బాగా తెలిసిన విషయమే. అందుకే ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి బరిలో దించే దిశగా మెగా టీమ్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కేవీయన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కే వెంకట నారాయణ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా పేతురాజు, మల్లూవుడ్ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజువల్స్ పరంగా, టెక్నికల్ వాల్యూస్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. మొత్తానికి డైరెక్టర్ బాబీ ఈసారి మామూలు ట్రీట్ ప్లాన్ చేయలేదు. చిరుని మునుపెన్నడూ చూడని ఊర మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం.