MS Subbulakshmi: లుక్ టెస్ట్ పూర్తి చేసిన రశ్మిక!
ABN, Publish Date - Aug 29 , 2026 | 08:51 AM
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రకు రశ్మిక మందణ్ణ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఆమెతో మూవీ మేకర్స్ లుక్ టెస్ట్ సైతం పూర్తి చేశారని సమాచారం.
తన దివ్య గాత్రంతో కోట్లాదిమందిని అలరించిన మధుర గాయని ఎమ్మెస్ సుబ్బు లక్ష్మి జీవిత కథను తెరకు ఎక్కించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సెప్టెంబర్ 16న సుబ్బులక్ష్మి జయంతి కావడంతో ఆ రోజున ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. 'జెర్సీ' వంటి క్లాసిక్ ఫిల్మ్ తో అందరి ప్రశంసలు పొందిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నారు. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్, బన్నీ వాసు, రాక్ లైన్ వెంకటేశ్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇక సుబ్బులక్ష్మి పాత్రను ఎవరు పోషిస్తారా అనే దానిపై చాలా చర్చ జరిగింది. కొన్ని పేర్లు వినిపించాయి. చివరకు సాయిపల్లవిని ఎంపిక చేశారని అన్నారు. అయితే డేట్స్ కుదరక పోవడం వల్ల సాయిపల్లవి పక్కకు తప్పుకోవడంతో ఆ పాత్రకు ఇప్పుడు రష్మికను ఎన్నుకున్నట్లు సమాచారం. రష్మిక లుక్ టెస్ట్ కూడా జరిగిందనీ, సంప్రదాయబద్ధమైన ఆ గెటప్ లో రష్మికను చూసి దర్శక నిర్మాతలు ఎంతో ఇంప్రెస్ అయ్యారనీ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్ పాత్రలతో మెప్పిస్తున్న భామలు
Raviteja: ‘ఇరుముడి’ తర్వాత రవితేజ స్పీడ్.. ఐశ్వర్య రాజేశ్‌తో కొత్త ప్రయోగం!
కృతి సనన్ రాఖీ యాడ్ వివాదం.. మధు చోప్రా హాట్ కామెంట్స్!