Raviteja: ‘ఇరుముడి’ తర్వాత రవితేజ స్పీడ్‌.. ఐశ్వర్య రాజేశ్‌తో కొత్త ప్రయోగం!

ABN , Publish Date - Aug 28 , 2026 | 07:02 PM

‘ఇరుముడి’తో భారీ విజయాన్ని అందుకుని మంచి జోష్‌లో  ఉన్నారు మాస్‌ మహారాజా రవితేజ. ప్రస్తుతం తదుపరి సినిమా పనుల్లో ఉన్నారు.

‘ఇరుముడి’తో భారీ విజయాన్ని అందుకుని మంచి జోష్‌లో  ఉన్నారు మాస్‌ మహారాజా రవితేజ (Raviteja). ప్రస్తుతం తదుపరి సినిమా పనుల్లో ఉన్నారు. ‘మ్యాడ్‌’ ఫేమ్‌ హసిత్‌ గోలీ (hasith Goli) దర్శకత్వంలో రవితేజ ఓ కొత్త చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.   ‘మ్యాడ్‌’తో తనదైన కామెడీ, యూత్‌ఫుల్‌ టేకింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న హసిత్‌ గోలీ.. ఇప్పుడు రవితేజ లాంటి మాస్‌ హీరోను ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ప్రముఖ నటి ఐశ్వర్య రాజేశ్‌ నటించనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య రాజేశ్‌ ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో కనిపించనున్నారట.

అయితే ఎలాంటి క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారనేది ఆసక్తిని కలిగిస్తోంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో షూటింగ్  ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి సంక్రాంతి బరిలో సినిమాను నిలపాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఇరుముడి’తో కమ్‌బ్యాక్‌ ఇచ్చిన మాస్‌ మహారాజా.. హసిత్‌ గోలీతో ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారో.. 2027 సంక్రాంతికి థియేటర్లలో ఎలాంటి సందడి నెలకొంటుందో చూడాలి!

Updated Date - Aug 28 , 2026 | 07:03 PM