Ranabaali: ‘రణబాలి’ విడుదల తేదీ ఖాయమైనట్టేనా?
ABN, Publish Date - Aug 11 , 2026 | 09:49 AM
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabali) ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా పేరున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబాలి’ (Ranabali) ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు దర్శకుడి ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన గత చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఈ జంట మరోసారి తెరపై కనిపించనుండటంతో అభిమానులు ‘రణబాలి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వాయిదా పడిన ‘రణబాలి’ రిలీజ్..
తొలుత ‘రణబాలి’ చిత్రాన్ని సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే సినిమా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అని విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. అక్టోబర్ 30న ‘రణబాలి’ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అదే తేదీన తమ్ముడి సినిమా ..
‘రణబాలి’ తొలుత అనుకున్న సెప్టెంబర్ 11 తేదీన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘EPIC’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అన్నదమ్ముల సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Tollywood: సీనియర్ నట, రచయిత కృష్ణేశ్వరరావు మృతి
శంకర్ డైరెక్షన్‌లో అజిత్ సినిమా.. వర్కవుట్ అవుతుందా?'