శంకర్ డైరెక్షన్‌లో అజిత్ సినిమా..  వర్కవుట్ అవుతుందా?

ABN , Publish Date - Aug 11 , 2026 | 07:32 AM

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల కాంబినేషన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌పై కోలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది.

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల కాంబినేషన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌పై కోలీవుడ్‌లో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ హీరో అజిత్ కుమార్ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కాంబినేషన్ నిజమైతే.. కోలీవుడ్‌లో ఇది భారీ ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శంకర్ (Shankar) సినిమా అంటే భారీతనం. ప్రస్తుతం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’(Velpari)పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్  ప్రారంభం కావదానికి కాస్త ఆలస్యం అవుతోందని టాక్.  దీంతో ఈ గ్యాప్‌లో ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని శంకర్ భావిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అజిత్ పేరు తెరపైకి వచ్చింది. శంకర్, అజిత్ (Ajitha) కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఇద్దరూ తమ తమ రంగాల్లో ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ కలిసి పనిచేయకపోవడం అభిమానులకు ఎప్పటినుంచో ఆసక్తికరమైన విషయమే. ఇప్పుడు ఈ ఇద్దరూ చేతులు కలిపితే ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరోవైపు అజిత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ‘డేర్ డెవిల్’ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో మంకథ 2 చేయనున్నట్లు సమాచారం.  ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక శంకర్–అజిత్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుందా? లేక ఇది కేవలం ప్రాథమిక చర్చలకే పరిమితమవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

Updated Date - Aug 11 , 2026 | 07:58 AM