Kangana Ranaut : 50 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి.. నాకు దక్కిన అవకాశం!

ABN , First Publish Date - 2023-10-24T16:07:23+05:30 IST

చెడుపై మంచి గెలిచిన ప్రతీకగా దసరా ఉత్సవాల్లో రావణ దహనం (Ravan Dahan) చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ప్రధాన మంత్రి చేతులమీదుగా ఈ తంతు జరుగుతుంటుంది. అయితే ఈ ఏడాది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Kangana Ranaut : 50 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి.. నాకు దక్కిన అవకాశం!

చెడుపై మంచి గెలిచిన ప్రతీకగా దసరా ఉత్సవాల్లో రావణ దహనం (Ravan Dahan) చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ప్రధాన మంత్రి చేతులమీదుగా ఈ తంతు జరుగుతుంటుంది. అయితే ఈ ఏడాది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 50 ఏళ్ల చరిత్రలో ఓ మహిళ సెలబ్రిటీ ఈ కార్యక్రమానికి వెళ్లి రావణ దహనం చేయడం ఇదే మొదటిసారి. మంగళవారం సాయంత్రం ఈ రావణ దహనం జరగనుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. తాజాగా మహిళా బిల్లును పార్లమెంట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి రావణ్‌ దహన్‌ కార్యక్రమానికి రామ్‌లీల కమిటీ కంగనాను ఆహ్వానించింది. ఆమెతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ కంగనా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది.

‘50 ఏళ్ల నుంచి వేడుక జరుగుతుంది. కానీ, రావణ్‌ దహన్‌ వేడుకను ఓ మహిళ చేయడం ఇదే మొదటిసారి. ఆ అవకాశం నాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పారు. తాజాగా ఆమె నటించిన తేజస్‌ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సర్వేశ్‌ మేవారా దర్శకత్వం వహించారు. 2016లో భారత వైమానిక దళం క్షేత్రస్థాయి పోరాటా విధానాల్లోకి మొట్టమొదటిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రోనీ స్ర్కూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated Date - 2023-10-24T16:07:23+05:30 IST