Rana Daggubati: తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్.. రానా సపోర్ట్

ABN , Publish Date - Jun 30 , 2025 | 08:59 PM

మంచి కథలకు రానా దగ్గుబాటి  ఎప్పుడు అండగా ఉంటారు. ఓమ్ కొత్త సినిమాకి సపోర్ట్ గా నిలిచేందుకు సిద్ధమయ్యారు రానా.  కేరాఫ్ కంచరపాలెం నిర్మాత ప్రవీణ పరుచూరితో మరోసారి చేతులు కలిపారు.

మంచి కథలకు రానా దగ్గుబాటి (Rana Daggubati) ఎప్పుడు అండగా ఉంటారు. ఓమ్ కొత్త సినిమాకి సపోర్ట్ గా నిలిచేందుకు సిద్ధమయ్యారు రానా.  'కేరాఫ్ కంచరపాలెం'  చిత్ర నిర్మాత ప్రవీణ పరుచూరితో (Praveena Paruchuri) మరోసారి చేతులు కలిపారు. ఆమె తాజాగా నిర్మిస్తున్న చిత్రం  'కొత్తపల్లిలో ఒకప్పుడు' (Kothapallilo Okappudu)  ఈ చిత్రం ద్వారా ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా అరంగేట్రం చేస్తున్నారు. కొత్తపల్లిలో ఒకప్పుడు పల్లెటూరి సున్నితమైన హాస్యంతో కూడిన, లైట్ హార్ట్‌డ్ ఎంటర్‌టైనర్. C/o కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి కల్ట్ ఫేవరెట్ చిత్రాలను నిర్మించిన ప్రవీణ ఇప్పుడు డైరెక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇది ఒక నోస్టాల్జిక్, హ్యుమరస్ స్టోరీతో తెరకెక్కనుంది. ఒక సంఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఒక గ్రామ యువకుడి నేపథ్యంలో సాగే సినిమా ఇది.  సాగుతుంది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ 'కొత్తపల్లిలో ఒకప్పుడు' కు న్యూ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తున్నారు. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ సీక్వెన్సులు, హాస్యంతో కూడిన ఉప కథల ద్వారా ఈ చిత్రం సరికొత్త అనుభూతిని పంచబోతోందని దర్శకురాలు చెబుతున్నారు.  ఇది తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్ లాంటిదని, త్వరలో థియేటర్లలో విడుదల కానుందని చెప్పారు. 

Updated Date - Jul 01 , 2025 | 09:35 AM