సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'బాహుబలి' రేంజ్ రోల్‌లో రానా!

ABN, Publish Date - Jul 27 , 2026 | 03:23 PM

ఫైనల్లీ రానా వచ్చేస్తున్నాడు. ప్రారంభోత్సవాలే తప్ప సెట్స్ పైకి వెళ్ళని ప్రాజెక్టులతో సతమతమవుతున్న ఈ భల్లాలదేవుడు.. మొత్తానికి ఒక మైండ్ బ్లోయింగ్ పాన్ ఇండియా ప్రాజెక్టుతో బిగ్ స్క్రీన్ పై రచ్చ చేయడానికి సిద్ధమయ్యాడు.

rana

చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం 'హను-మాన్'. తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫాంటసీ మూవీకి 'జై హనుమాన్' పేరుతో భారీ సీక్వెల్ తెరకెక్కుతోంది. రిషబ్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.


ఈ క్రేజీ ప్రాజెక్టులో పవర్‌ఫుల్ అశ్వత్థామ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. విశేషం ఏమంటే... కేవలం ఈ ఒక్క సినిమాలోనే కాదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మొత్తంలోనూ అశ్వత్థామ పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతోందట. 'బాహుబలి' తర్వాత రానాకి దక్కిన మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఇదే కావడంతో.. అశ్వత్థామగా ఆయన గెటప్ ఎలా ఉండబోతోందోనని అభిమానుల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'హను-మాన్‌' చిత్రాన్ని మరిపించేలా... ఈ సీక్వెల్ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ ఉన్నత ప్రమాణాలతో దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుంటే.. హను-మాన్ హీరో తేజ సజ్జా మళ్లీ తన పాత పాత్రలోనే అలరించబోతున్నాడు. ఇప్పుడు వీరితో పాటు రానా కూడా తోడవ్వడంతో.. 'జై హనుమాన్' ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి:

‘టాక్సిక్’ వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్.. అరాచకం

200 మిలియన్ వ్యూస్‌.. ‘ఆయా షేర్’ ఆల్ టైమ్ రికార్డ్

మహేష్ బాబు తర్వాత మళ్లీ జై కృష్ణలోనే చూశా: వీకే నరేష్

Updated Date - Jul 27 , 2026 | 03:30 PM