మహేష్ బాబు తర్వాత మళ్లీ జై కృష్ణలోనే చూశా: వీకే నరేష్
ABN , Publish Date - Jul 26 , 2026 | 09:50 PM
జై కృష్ణను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను హీరోగా పరిచయం అవుతుండటం నాకు చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు సీనియర్ నటుడు వీకే నరేష్.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని (Jai Krishna Ghattamaneni).. ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram) సినిమాతో హీరోగా పరిచయం అవుతోన్న విషయం తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తుండగా.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర రిలీజ్ ప్రెస్ మీట్‌ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీకే నరేష్ (VK Naresh) స్పీచ్ హైలెట్ అవుతోంది.
వీకే నరేష్ మాట్లాడుతూ.. ‘‘జై కృష్ణను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను హీరోగా పరిచయం అవుతుండటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. తను సూపర్ స్టార్ కృష్ణ లెగసీని ఒక బాధ్యతగా తీసుకుంటున్నాడు. అలాగే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. అందుకు తనకు కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నాను. తెలుగు సినిమా లెగసీ చాలా గొప్పది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు పరిశ్రమకు రెండు కళ్లు అయితే.. కృష్ణ గుండెలాంటివారు. ఆ గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. ఎన్నో చారిత్రాత్మకమైన, చరిత్రలో నిలిచిపోయే సినిమాలు చేశారు. ఫస్ట్ పాన్ వరల్డ్ రిలీజ్ సినిమా కూడా పద్మాలయ స్టూడియోస్ నుంచే వచ్చింది. ‘మోసగాళ్లకు మోసగాడు’ అన్ని భాషల్లో రిలీజై, రష్యా వరకు వెళ్లి పాన్ ఇంటర్నేషనల్ విజయాన్ని సాధించింది.
అలాగే అశ్వినీ దత్ ఎన్నో మైలురాయి చిత్రాలను అందించారు. అలాంటి ఆయన ఈ సినిమాను ప్రజెంట్ చేయడం, జెమినీ కిరణ్ వంటి గొప్ప చరిత్ర ఉన్న నిర్మాత నిర్మించడం.. అన్నీ ఆనందాన్ని కలిగించే విషయాలు. అజయ్ భూపతి నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన తీసిన ‘ఆర్ఎక్స్ 100’ బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. ‘శ్రీనివాస మంగాపురం’ కూడా తెలుగు సినిమా లెగసీలో ఒక పేజీని దక్కించుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాను. ఇది ఒక ఆడియో-విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. అజయ్ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయనతో మరోసారి కలిసి పనిచేయాలని ఉంది. ఇందులో మోహన్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. రాషా తడానీ ద్వారా మరో అద్భుతమైన హీరోయిన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుంది. ఇందులోని సాంగ్స్, ట్రైలర్, యాక్షన్‌తో జై కృష్ణ ఇప్పటికే అద్భుతంగా ల్యాండ్ అయ్యాడు. ఇందులోని ప్రేమకథ ప్రతి యువతకు ఎక్కడో గుచ్చుకుంటుంది. యాక్షన్ సీన్స్ అద్భుతంగా వచ్చాయి.
జై కృష్ణను చూస్తుంటే నా దగ్గర ఉన్న సూపర్ స్టార్ కృష్ణ ఫొటో గుర్తుకొచ్చింది. మహేష్ బాబు తర్వాత అంత మంచి సత్ప్రవర్తన జై కృష్ణలో చూశాను. తను చాలా దూరం వెళ్తాడు. నేను కచ్చితంగా చెబుతున్నాను.. ఈ సినిమాతో హిట్ కొడుతున్నాం. ఈ సినిమాకు ప్రేక్షకులు కృష్ణ, మహేష్ బాబుల కోసం, ఇంకా ఒక అద్భుతమైన సినిమా కోసం వస్తారు. ఈ సినిమాలో నేను మర్చిపోలేని పాత్ర చేశాను. ఇది నా జీవితంలో గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. జై కృష్ణ ఒక పెద్ద హిట్‌తో లాంచ్ అవుతున్నాడు. అందరూ ఈ సినిమాకు పెద్ద విజయం అందించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
‘వారణాసి’.. కీలక అప్డేట్ ఇచ్చిన కీరవాణి
అన్బరివ్ మూవీ కంటే ముందే ఆ దర్శకుడితో కమల్ క్రేజీ ఫిల్మ్!
‘స్పిరిట్’లో కత్రినా కైఫ్ రోల్ అదేనా?.. సందీప్ వంగా మాస్టర్ ప్లాన్