‘టాక్సిక్’ వన్ మంత్ కౌంట్‌డౌన్ పోస్టర్.. అరాచకం
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:08 AM
KVN ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా.. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ‘టాక్సిక్’ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది.
KGF సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన గుర్తింపు సాధించిన రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) కథానాయకుడిగా, ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు గీతు మోహన్‌దాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్’ (Toxic). KVN ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా.. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో, సినిమా కౌంట్‌డౌన్‌ను అధికారికంగా ప్రారంభిస్తూ మేకర్స్ ఒక వినూత్నమైన ‘వన్ మంత్ కౌంట్‌డౌన్’ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ఈ కౌంట్‌డౌన్ పోస్టర్ ఫియర్, మిస్టరీ, అల్టిమేట్ స్టైల్ మిళితమై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ పోస్టర్‌లో యశ్ అత్యంత ప్రశాంతంగా సిగరెట్ వెలిగిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, సిగరెట్ పొగ, నలుపు వెలుగుల మధ్య ఆయన ముఖం పూర్తిగా కనిపించకుండా ఉంచి పాత్రలోని మిస్టరీని కొనసాగించారు. మరోవైపు, ఆయన చేతివేళ్ల నుంచి రక్తపు చుక్కలు జారుతూ తెల్లటి షర్ట్‌పై పడటం, రక్తంతో తడిసిన చేతులు ఒక బిగ్ యాక్షన్ సీన్ ఉత్కంఠను తలపిస్తున్నాయి.
యశ్ రఫ్ బియర్డ్, టాటూలు ఉన్న చేతులు, వేళ్లకు స్టైలిష్ రింగ్స్, రాయల్ టైలర్డ్ ఓవర్‌కోట్‌తో కనిపించిన తీరు ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. కథ గురించి ఎలాంటి చిన్న క్లూ కూడా బయటకు రానివ్వకుండా, ప్రతి పోస్టర్, గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలను పెంచేలా ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను మేకర్స్ నడిపిస్తున్నారు. ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘టాక్సిక్’ చిత్రం ఈ ఏడాది భారతీయ చిత్రసీమలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్‌లలో ఒకటనే విషయం తెలియంది కాదు.
ఇవి కూడా చదవండి:
200 మిలియన్ వ్యూస్.. ‘ఆయా షేర్’ ఆల్ టైమ్ రికార్డ్
మహేష్ బాబు తర్వాత మళ్లీ జై కృష్ణలోనే చూశా: వీకే నరేష్
‘వారణాసి’.. కీలక అప్డేట్ ఇచ్చిన కీరవాణి