200 మిలియన్ వ్యూస్‌.. ‘ఆయా షేర్’ ఆల్ టైమ్ రికార్డ్

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:53 PM

నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న క్రేజీ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా సాంగ్ ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

The Paradise New Still

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా, శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న క్రేజీ పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమా విడుదలకు ముందే తన మ్యూజికల్ చార్ట్‌బస్టర్స్, ఊరమాస్ ఎలివేషన్లతో నెట్టింట సంచలనాలను సృష్టిస్తోంది. ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ (Aaya Sher) యూట్యూబ్‌తో పాటు అన్ని డిజిటల్ వేదికల వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ పవర్‌ఫుల్ మాస్ యాంథమ్ ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది సౌత్ సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న అతిపెద్ద చార్ట్‌బస్టర్ పాటల్లో ఒకటిగా నిలిచి, బాక్సాఫీస్ జాతరకు ముందే తన విశ్వరూపాన్ని చాటుకుంటోంది.


సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందించిన హై-వోల్టేజ్ మాస్ బీట్స్, అల్టిమేట్ రిథమ్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. దీనికి ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాసిన పవర్‌ఫుల్, ఎనర్జిటిక్ లిరిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలవగా.. అద్దుల జంగిరెడ్డి, అర్జున్ చాందీ వినూత్న వోకల్స్‌తో తమ ఎనర్జీని నూరిపోశారు. క్యాచీ ట్యూన్, హై-వోల్టేజ్ కొరియోగ్రఫీ, కంటికి విందుగా అనిపించే విజువల్ కాన్సెప్ట్ కారణంగా ఈ పాట ప్రతి ఊరిలోనూ, ప్రతి గల్లీలోనూ మారుమోగుతోంది. యూత్, కాలేజ్ స్టూడెంట్స్, చిన్న పిల్లల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ ట్రాక్ బాగా ఎక్కేసింది. ఎలాంటి వేడుకలైనా, పబ్లిక్ ఈవెంట్స్ అయినా, సోషల్ మీడియా రీల్స్ అయినా ‘ఆయా షేర్’ పాట లేకుండా పూర్తి కానంతలా ఒక పెద్ద సెలబ్రేషన్ సాంగ్‌గా రూపాంతరం చెందింది.


‘దసరా’ వంటి ఊరమాస్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో నానిని మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్, రగ్గడ్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. నాని ఫియర్స్ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ మేకోవర్, స్క్రీన్ మేనియా క్రియేట్ చేసే మేనరిజమ్స్, హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్ సినీ ప్రియులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిపాయి. ఆరంభంలోనే ‘ఆయా షేర్’ పాట ఈ స్థాయి సంచలనాలు సృష్టిస్తుండటంతో, 2026లో దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ మొదటి వరుసలో నిలిచింది. ఇప్పటికే మొదటి పాటతో రికార్డులు బద్దలవుతుండగా, ఈ ఆల్బమ్ నుంచి రానున్న నెక్స్ట్ సాంగ్, క్రేజీ అప్‌డేట్ కోసం నాని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మహేష్ బాబు తర్వాత మళ్లీ జై కృష్ణలోనే చూశా: వీకే నరేష్

‘వారణాసి’.. కీలక అప్డేట్ ఇచ్చిన కీరవాణి

అన్బరివ్ మూవీ కంటే ముందే ఆ దర్శకుడితో కమల్ క్రేజీ ఫిల్మ్!

Updated Date - Jul 27 , 2026 | 12:52 AM