‘ఇరుముడి’పై రామ్ చరణ్ ట్వీట్.. వాట్టే టైమింగ్
ABN, Publish Date - Aug 26 , 2026 | 11:48 AM
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘‘భారీ విజయం సాధించిన రవితేజకు, చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ సినిమాకు దక్కుతున్న ఆదరణను చూడటం ఎంతో సంతోషంగా ఉంది. దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, మైత్రీ మూవీ మేకర్స్‌కు మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను.. స్వామి శరణం’’ అంటూ చరణ్ ట్వీట్ చేశారు. సాధారణంగా ఇది చిత్ర పరిశ్రమలోని పరస్పర ప్రశంసలా కనిపించినప్పటికీ, ఈ ట్వీట్ చేసిన సమయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది.
పాన్-ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలతో వచ్చిన యశ్ ‘టాక్సిక్’ (Yash Toxic) విడుదలైన రోజే చరణ్ ఈ ట్వీట్ చేయడం వెనుక పెద్ద కథే నడుస్తోందంటూ నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘టాక్సిక్’ సినిమా తెలుగు స్టేట్స్ హక్కులను దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) సంస్థ భారీ ధరకు దక్కించుకుని విడుదల చేసింది. అయితే, థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ విజయవంతంగా ఆడుతూ భారీ వసూళ్లు రాబడుతున్నప్పటికీ, ఎస్వీసీ సంస్థ కావాలనే ‘ఇరుముడి’ థియేటర్లను తగ్గించి ‘టాక్సిక్’ చిత్రానికి ఎక్కువ స్క్రీన్లు కేటాయించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. తీరా విడుదలయ్యాక ‘టాక్సిక్’ చిత్రానికి ఆశించిన స్థాయిలో టాక్ రాకపోగా, మిశ్రమ స్పందన మొదలైంది.
ఈ మొత్తం వ్యవహారానికి గతంలో జరిగిన పరిణామాలను జోడిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. గతంలో రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ రిలీజ్ సమయంలో ఎస్వీసీ సంస్థ హడావుడి చేయడమే కాకుండా, టికెట్ రేట్ల పెంపు విషయంలోనూ అడ్డంకులు సృష్టించిందని, దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన అతి సాధారణమైనది కాదని మెగా అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు అదే ఎస్వీసీ రిలీజ్ చేసిన ‘టాక్సిక్’ తేలిపోయి, మైత్రీ వారి ‘ఇరుముడి’కి క్రేజ్ పెరుగుతున్న వేళ.. కరెక్ట్‌గా రిలీజ్ రోజే చరణ్ ‘ఇరుముడి’ని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం పర్ఫెక్ట్ కౌంటర్ అని, ‘వాట్టే టైమింగ్ చరణ్’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ‘నువ్వు కూడా చేసి ఉంటే బాగుండేది అన్నా’ అంటూ అభిమానులు రియాక్ట్ అవుతుండటం విశేషం. అందుకు కారణం.. సంవత్సరంలో ఎక్కువ రోజులు అయ్యప్ప మాలధారుడై ఉంటడమే.
ఇవి కూడా చదవండి:
2.5 కోట్లతో భారతీరాజా స్మారక మండపం.. సీఎం విజయ్‌పై ప్రశంసలు
Toxic Twitter Review: ‘ఇరుముడి’కి థియేటర్లు పెంచుకోవచ్చట!
100 కోట్ల క్లబ్‌లో.. 'ఇరుముడి'