Toxic Twitter Review: ‘ఇరుముడి’కి థియేటర్లు పెంచుకోవచ్చట!

ABN , Publish Date - Aug 26 , 2026 | 09:25 AM

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ నేడు (ఆగస్ట్ 26) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రస్తుతం ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ నడుస్తోంది.

Toxic Twitter Review

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ నేడు (ఆగస్ట్ 26) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్ 2’ తర్వాత యశ్ నటిస్తున్న చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి సారించారు. విడుదలైన తొలి ఆట నుంచే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో నెటిజన్లు తమ రివ్యూలను, అభిప్రాయాలను పంచుకుంటున్నారు.


ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రానికి ట్విట్టర్‌లో మిశ్రమ స్పందన (Mixed Talk) లభిస్తోంది. సినిమాలో యశ్ మాస్ ఎంట్రీ, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాండ్ సినిమాటోగ్రఫీ, కియారా అద్వానీ-నయనతార నటన బాగున్నాయని కొందరు ప్రశంసిస్తుండగా.. నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, ఫస్ట్ హాఫ్‌లో విపరీతమైన ల్యాగ్, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయని మరికొందరు పెదవి విరుస్తున్నారు. దాదాపు మూడు గంటల నిడివి ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుందని, క్లైమాక్స్ కూడా తీవ్రంగా నిరాశపరిచిందని పోస్టులు పెడుతున్నారు. ‘టాక్సిక్’ టాక్ చూస్తుంటే రవితేజ ‘ఇరుముడి’ చిత్రానికి థియేటర్లు పెంచుకోవచ్చంటూ సోషల్ మీడియాలో సెటైరికల్ కామెంట్స్ మొదలయ్యాయి.


‘టాక్సిక్’పై నెటిజన్ల ట్విట్టర్ రివ్యూలు ఇవే:

నెటిజన్ 1: ‘‘#ToxicReview : ఫస్ట్ హాఫ్ - యశ్ ఎంట్రీ, ఫైట్ ఎపిసోడ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, సెటప్ రిచ్‌గా ఉంది. కియారా అద్వానీ, నయనతార నటన మెప్పించింది. కానీ ఫస్ట్ హాఫ్‌లో విపరీతమైన ల్యాగ్ ఉంది. ఒక అడల్ట్ సీన్, ఆ వెంటనే ఫైట్ అన్నట్లుగా రొటీన్‌గా సాగుతుంది. ఎమోషనల్ కనెక్ట్ ఏమాత్రం కుదరలేదు.’’


నెటిజన్ 2: ‘‘#ToxicReview: యశ్ ఎంట్రీ, యాక్షన్ విజువల్స్ పర్వాలేదు. కియారా అద్వానీ తన పాత్రలో అదరగొట్టింది. కానీ కోర్ ఎమోషన్ ఏమాత్రం వర్కవుట్ కాలేదు. స్లో నేరేషన్, చివరి 40 నిమిషాలు సిల్లీగా మారిన సన్నివేశాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. రన్‌టైమ్ ఎక్కువై బోరింగ్ అనుభవాన్ని మిగిల్చింది. వెరీ డిజప్పాయింటింగ్ ఔటింగ్!’’


నెటిజన్ 3: ‘‘#ToxicReview: మూడు గంటల పాటు సాగిన ఈ సినిమా పూర్తిగా టార్చర్ అనిపించింది. పాత్రల పరిచయం సరిగ్గా లేదు, ఎవరితోనూ కనెక్ట్ కాలేం. కథ, దర్శకత్వం పూర్తిగా విఫలమైంది. 4 ఏళ్ల సమయం వృథా అయింది. దీని బదులు థియేటర్లలో ‘ఇరుముడి’ని మరోసారి సెలబ్రేట్ చేసుకోవచ్చు! (రేటింగ్: 1/5)’’


నెటిజన్ 4: ‘‘గొప్ప విజువల్స్, నిర్మాణ విలువలు ఉన్నాయి కానీ, స్క్రీన్‌ప్లే, పేసింగ్, ఎమోషనల్ కనెక్ట్ వీక్. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా, కథనం తేలిపోయింది. స్టైల్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ. 2026లో అత్యంత నిరాశపరిచిన చిత్రాల్లో ఇది ఒకటి. (రేటింగ్: 1.5/5)’’


నెటిజన్ 5: ‘‘#ToxicReview: సర్టిఫైడ్ పాన్-ఇండియా సూపర్ స్టార్! ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా, పాత్రల బిల్డప్‌తో బాగుంది. విజువల్స్ అద్భుతం. సెకండ్ హాఫ్ పవర్‌ఫుల్.. యశ్ మాసీ అవతార్, యాక్షన్ అదిరిపోయాయి. కేజీఎఫ్ తర్వాత యశ్‌కి మరో బిగ్ విన్నర్! (రేటింగ్: 3.5/5)’’

ఇవి కూడా చదవండి:

100 కోట్ల క్లబ్‌లో.. 'ఇరుముడి'

టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్.. హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

సంక్రాంతికి.. రవితేజ 'దాగుడు మూతలు దండాకోర్' ఫిక్స్‌

Updated Date - Aug 26 , 2026 | 09:25 AM