లావణ్య త్రిపాఠికి రామ్ చరణ్ సపోర్ట్.. విషయమిదే!
ABN , Publish Date - May 01 , 2026 | 11:23 PM
మెగా కోడలు లావణ్య త్రిపాఠి, తన బావ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సపోర్ట్ తీసుకుంటున్నారు. అర్థం కాలేదు కదా.. ఆమె నటించిన సినిమాకు రామ్ చరణ్ సపోర్ట్ అందిస్తున్నారు.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), తన బావ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) సపోర్ట్ తీసుకుంటున్నారు. అర్థం కాలేదు కదా.. అసలు విషయం ఏమిటంటే.. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు మే 8న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సపోర్ట్ తీసుకుంటున్నారు. ‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను మే 2, శనివారం ఉదయం 10 గంటల 31 నిమిషాలకు రామ్ చరణ్ డిజిటల్‌గా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
రామ్ చరణ్ పేరు వినబడగానే ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ మొదలైంది. ట్రైలర్‌లో కనుక మ్యాటర్ ఉంటే మాత్రం.. మే 8న విడుదలయ్యే చిత్రాలకు ఈ సినిమా మంచి పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అయితే, భారీగానే అంచనాలను పెంచేసింది. ట్రైలర్‌తో ఆ అంచనాలు రెట్టింపు అవుతాయని చిత్రయూనిట్ భావిస్తోంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి)’ ఫేమ్ తాతినేని సత్య (Tatineni Satya) దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు.
రెండు వేర్వేరు కుటుంబాలు, నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే.. వారి మధ్య ఎమోషన్స్ ఎంతో బలంగా ఉండాలి. ఇలాంటి సునిశితమైన అంశాన్ని ఈ చిత్రంలో దర్శకుడు తాతినేని సత్య ఆవిష్కరించినట్లుగా తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్‌టైనింగ్‌గా ఈ చిత్రంలో చూపించామని, కచ్చితంగా ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందని, చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!
‘ఇద్దరి నుంచి ముగ్గురుగా’.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!
‘భోగి’లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?