Sathi Leelavathi: మెగా కోడలు.. సతీ లీలావతి టీజర్ అదిరింది
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:08 PM
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రధారులుగా దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ .
లావణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi), దేవ్ మోహన్ (Dev Mohan) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ (Anandi Art Creations) సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ (Durga Devi Pictures) బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి) చిత్రాలను డైరెక్ట్ చేసిన తాతినేని సత్య (Satya Tatineni) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భార్య, భర్తత మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఫన్నీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు.
తాజాగా మంగళవారం మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే లావణ్య, దేవ్ మోహన్ జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుంది. కానీ నెక్ట్స్ సీన్‌లోనే దేవ్ మోహన్‌ను లావణ్య కొట్టి కట్టేసుంటుంది. వారి మధ్య జరిగే గొడవకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను టీజర్‌లో మనం గమనించవచ్చు. అలాగే అలాగే.. 5 రూపాయల పెన్నే కదా అని దానిని తక్కువగా చూడొద్దు రూ.5కోట్ల చెక్కుకు ఆ పెన్నుతోనే సంతం పెట్టాలని దేవ్ మోహన్ అనగా.. ఏదైనా అయిలే కదా అని కోకోనట్ అయిల్‌ను బెంజ్ కారులో పోయలేం కదా అనే లావణ్య డైలాగులు ఆకట్టుకునేలా, హస్యం పంచేలా ఉన్నాయి.
అలాంటి భార్య భర్తల మధ్య జరిగే గొడవలో వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, జాఫర్, మొట్ట రాజేంద్రన్ ఎందకు ఇన్ వాల్వ్ అయ్యారు. అసలు గొడవేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని దర్శక నిర్మాతలు ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందించగా, బినేంద్ర మీనన్ కెమెరామెన్‌గా, సతీష్ సూర్య ఎడిటర్‌గా వ్యవహరించారు.