Lavanya Tripathi: పాపం.. లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు..

ABN , Publish Date - Jan 11 , 2024 | 10:34 AM

ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని పెళ్లాడిన లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు అంటే.. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అని అనుకుంటారేమో.. ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. అవును.. రీల్ లైఫ్‌లో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అదెలా అనుకుంటున్నారా? అది తెలియాలంటే.. తాజాగా విడుదలైన ‘మిస్ పర్ఫెక్ట్’ టీజర్ చూసేయాల్సిందే.

Lavanya Tripathi: పాపం.. లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు..
Lavanya Tripathi

ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ (Mega Prince Varun Tej)ని పెళ్లాడిన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)కి కొత్త కష్టాలు అంటే.. ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అని అనుకుంటారేమో.. ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. అవును.. రీల్ లైఫ్‌లో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అదెలా అనుకుంటున్నారా? అది తెలియాలంటే.. తాజాగా విడుదలైన ‘మిస్ పర్ఫెక్ట్’ (Miss Perfect) టీజర్ చూసేయాల్సిందే. అసలు టైటిల్ వింటుంటేనే ఆమె ప్రాబ్లమ్ ఏమిటనేది అర్థం అవుతుంది. ఇక టీజర్ చూస్తే.. పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. అప్పుడెప్పుడో మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మహానుభావుడు’ సినిమా గుర్తొస్తుంది.

Love-2.jpg

సరే విషయంలోకి వస్తే.. లావణ్య త్రిపాఠి నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ టీజర్‌ని తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ విడుదల చేసింది. ఈ టీజర్ చూసిన వాళ్లంతా.. పాపం, లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు మొదలయ్యాయని అనుకుంటున్నారు. కారణం ఇందులో ఆమె పాత్ర అలాంటిది మరి. ‘నేను తెలిసిన ఎవరికైనా.. నా గురించి తెలిసే ఫస్ట్ విషయం.. నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం’ అనగానే.. అది మీ పర్‌ఫెక్షన్ అని వాయిస్ వినిపిస్తుంది. ‘పర్‌ఫెక్షన్ ప్రాబ్లమ్ ఎలా అవుతుంది? సింగర్ దగ్గరకు వెళ్లి.. మాటల్లో చెప్పొచ్చుగా.. పాటలు ఎందుకు అని అంటారా?’ అని లావణ్య క్వశ్చన్ చేస్తున్న తీరు చూస్తుంటే.. ఆమె కష్టాలు ఏంటనేది అర్థమవుతోంది. టీజర్ అంతా ఇలా ఇంట్రస్టింగ్‌గా సాగడమే కాకుండా.. ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలను పెంచేస్తోంది. మొత్తంగా అయితే పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి.. ఓ మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయాన్ని మాత్రం ఈ టీజర్ తెలియజేస్తోంది. (Miss Perfect Teaser Out)


Love-1.jpg

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ కొత్త ఏడాదిలో ‘మిస్ పర్ఫెక్ట్’ అనే ఈ సరికొత్త సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ప్రతి పని పర్ఫెక్ట్‌గా చేసే మిస్టర్ పర్ఫెక్ట్‌ల గురించి మాట్లాడుకుంటుంటాం...కానీ ఇక్కడ మిస్ పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేసింది, చేయించింది అనేది ఈ వెబ్ సిరీస్‌లో హిలేరియస్‌గా చూపించబోతున్నారు దర్శకుడు విశ్వక్ ఖండేరావ్. లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Janhvi Kapoor: ప్రేమలో పడిపోయా.. నాని ‘హాయ్ నాన్న’పై జాన్వీకపూర్

************************

*నన్ను క్షమించు స్వామీ... కెప్టెన్‌ సమాధి వద్ద హీరో విశాల్‌ భావోద్వేగం

***************************

*Guntur Kaaram: ‘మావ ఎంతైనా’.. లిరికల్ సాంగ్

***************************

*Vijay Sethupathi: హిందీ నేర్చుకోవద్దని ఎవరూ చెప్పలేదు

*******************************

Updated Date - Jan 11 , 2024 | 10:35 AM