Lavanya Tripathi: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు.. మెగా కోడ‌లు బెస్ట్‌ విషెష్‌!

ABN , Publish Date - May 12 , 2024 | 09:37 PM

మే 13న సోమ‌వారం పోలింగ్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో చాలా మంది ప్ర‌ముఖులు,సెల‌బ్రిటీలు ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కును త‌ప్ప‌నిస‌రిగా వినియోగించుకోవాలని కొరుతూ త‌మ త‌మ‌ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్టులు, వీడియో సందేశాలు పెడుతున్నారు.

Lavanya Tripathi: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు.. మెగా కోడ‌లు బెస్ట్‌ విషెష్‌!
pawan kalyan

గ‌డిచిన రెండు నెల‌లుగా జ‌రుగుతున్న రాజ‌కీయ హాడావుడి శ‌నివారం సాయంత్రంతో ముగిసిన సంగ‌తి తెలిసిందే. మే 13న సోమ‌వారం పోలింగ్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో చాలా మంది ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కును త‌ప్ప‌నిస‌రిగా వినియోగించుకోవాలని కొరుతూ త‌మ త‌మ‌ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్టులు, వీడియో సందేశాలు పెడుతున్నారు. అంతేగాక త‌మ‌కు ప‌రిచ‌యం ఉన్న‌వాళ్ల‌ని త‌మ వారిని గెలిపించాల‌ని కొరుతున్నారు.


ఈక్ర‌మంలో మెగా కోడ‌లు వ‌రుణ్ తేజ్ స‌తీమ‌ణి క‌థానాయిక లావ‌ణ్య త్రిపాఠి (Lavanya tripathi Konidela) త‌న‌దైన శైలిలో ప‌వ‌ర్ స్టార్‌కు త‌న పూర్తి మ‌ద్ద‌తు తెలియ‌జేస్తూ బెస్ట్ విషెస్ తెలిపింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బ‌రిలో ఉన్న త‌న చిన మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) విజ‌యం సాధించాల‌ని కోరుతూ ఓ ర్యాలీలో ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తున్న ఫొటోల‌ను జ‌త చేసి త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేసింది.

దీంతో క్ష‌ణాల్లో ఆ పోస్టు వైర‌ల్‌గా మారింది. లావ‌ణ్య త్రిపాఠి(Lavanya tripathi Konidela)నే గాక మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej Konidela), మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మిత‌, హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు క‌థానాయిక నిధి అగ‌ర్వాల్ (Nidhhi Agerwal),స‌లార్ ఫేమ్ శియా రెడ్డిలు బెస్ట్ విషెస్ చెబుతూ త‌మ త‌మ‌ ఎక్స్, ఇన్ స్టా అకౌంట్ల‌లో పోస్టులు పెట్టారు.

Updated Date - May 12 , 2024 | 09:46 PM