‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్.. చరణ్ మాస్ జాతర ఎప్పుడంటే!

ABN , Publish Date - Apr 25 , 2026 | 09:20 AM

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘పెద్ది’ విడుదల విషయంలో గతంలో కొన్ని మార్పులు జరిగినప్పటికీ, మేకర్స్ జూన్ నెలలో రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటన చేశారు.

Peddi Movie Update

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదొక మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కేవలం ఒక్క పాట మినహా మిగతా టాకీ పార్ట్ అంతా పూర్తయినట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.


ప్రస్తుతం చిత్రయూనిట్ ఆ మిగిలిపోయిన స్పెషల్ సాంగ్ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉంది. ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి శృతి హాసన్ స్టెప్పులేస్తున్నట్టు సమాచారం. ఈ మాస్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కలర్ గ్రేడింగ్ వంటి పనులు చివరి దశకు చేరుకున్నాయని సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి జోడీ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తున్నాయి.


ఈ సినిమా విడుదల విషయంలో గతంలో కొన్ని మార్పులు జరిగినప్పటికీ, మేకర్స్ జూన్ నెలలో రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటన చేశారు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం, జూన్ 25వ తేదీన (Peddi Release Date) ‘పెద్ది’ థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, జూన్ 24వ తేదీ రాత్రి నుంచే భారీ ఎత్తున ప్రీమియర్ షోలు పడే అవకాశం ఉందని సమాచారం. అంటే పెద్ది జాతర ఆ రోజే మొదలుకాబోతోంది. ఈ విడుదల తేదీపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే త్వరలోనే చిత్రయూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ లేదా వీడియో ద్వారా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే ప్లాన్‌లో ఉన్నారట. రామ్ చరణ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్న ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!

పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ! ఇక పరువాల విందే!

Updated Date - Apr 25 , 2026 | 09:20 AM

Peddi - Ram Charan:  పెద్ది కోసం రామ్ చరణ్ ఫిట్‌నెస్‌ మిషన్‌

Peddi : రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. మోత మోగడమే

Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..

Peddi Song: ‘పెద్ది సాంగ్‌.. బుచ్చి భలే ప్లాన్‌ చేశాడు..

Peddi First Shot: రామ్ చరణ్ చెప్పినట్టే ఫస్ట్ షాట్ అదిరింది