గ్లోబల్ రేంజ్.. ఇంకా తడబడితే ఎలా చరణ్?
ABN , Publish Date - Nov 10 , 2026 | 02:59 PM
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఆస్కార్ వేదిక వరకు వెళ్లి, అంతర్జాతీయ స్థాయిలో ‘గ్లోబల్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పబ్లిక్ వేదికలపై మాట్లాడే తీరుపై మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది.
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఆస్కార్ వేదిక వరకు వెళ్లి, అంతర్జాతీయ స్థాయిలో ‘గ్లోబల్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan).. పబ్లిక్ వేదికలపై మాట్లాడే తీరుపై మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. సోమవారం హైదరాబాద్‌లో అనీష్ నటించిన ‘ఇట్లు అర్జున’ (Itllu Arjuna) ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ స్టేజ్‌పై మాట్లాడిన ప్రసంగం ప్రస్తుతం నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతోంది. అంతటి గ్లోబల్ గుర్తింపు సాధించిన స్టార్ హీరో, మైక్ పట్టుకుని మాట్లాడే సమయంలో ఇంకా తడబడుతుండటం చూసి నెటిజన్లతో పాటు స్వయంగా మెగా అభిమానులు కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఈ వేడుకలో రామ్ చరణ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీలోకి ఇంతమంది కొత్త దర్శకులను, టాలెంట్‌ను పరిచయం చేసే దమ్ము నాగార్జున గారికి తప్ప ఇంకెవరికీ లేదని ఆయన పేర్కొనడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత ‘ఇట్లు అర్జున’ చిత్రంలో హీరో పోషించిన లోపం ఉన్న పాత్ర గురించి ప్రస్తావిస్తూ.. తాను కూడా గతంలో ‘రంగస్థలం’ సినిమాలో ‘మూగవాడిగా’ నటించానని పొరపాటుగా నోరుజారారు. దీంతో వేదికపై ఉన్నవారు, ఆడియన్స్ ఒక్కసారిగా కంగుతిన్నారు. ‘రంగస్థలం’లో చరణ్ పోషించిన చిట్టిబాబు ఐకానిక్ క్యారెక్టర్ ‘చెవిటి’ పాత్ర అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటిది తాను స్వయంగా నటించి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన పాత్రను ‘మూగ పాత్ర’ అని చరణ్ చెప్పడంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ‘అయ్యా గ్లోబల్ స్టార్.. మీరు చేసింది చెవిటి క్యారెక్టర్ అండీ బాబూ!’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
అంతేకాకుండా తన ప్రసంగం ముగింపులో.. ‘ఈసారి నేనేం తప్పుగా మాట్లాడలేదు, ఎవరినీ మరిచిపోలేదనే అనుకుంటున్నాను’ అంటూ చరణ్ వ్యాఖ్యానించడం చూస్తుంటే, ఆయన ఇంకా స్టేజ్ ఫియర్‌తోనో లేక మాట్లాడేటప్పుడు తీవ్రమైన అభద్రతాభావంతోనో ఉన్నారనే భావన కలుగుతోందని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో వేదికలను చూసినప్పటికీ, పబ్లిక్ ఈవెంట్లలో ఎలా మాట్లాడాలో, పదాలను ఎలా ప్రయోగించాలో ఇంకా సరిగ్గా పట్టు సాధించలేకపోతున్నారని కామెంట్స్ వస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోలు బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ప్రతి మాటనూ ఆచితూచి మాట్లాడుతుంటారు. అలాంటిది గ్లోబల్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ తరచూ ఇలా తడబడటం, తెలుగులో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లడం ఆయన బ్రాండ్ ఇమేజ్‌కు ఏమాత్రం సరిపడదని, ఇప్పటికైనా తన స్పీచ్ డెలివరీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
మెగా ఈవెంట్స్‌కు అకీరా, ఆద్యలను మీరే పంపిస్తారా?.. రేణు దేశాయ్ ఆన్సర్ ఇదే
తారక్ మా పెద్దబ్బాయ్.. చరణ్ నా తమ్ముడు: కింగ్
మూడోసారి విడాకులు?.. పవన్ కళ్యాణ్ మరో యుద్ధం చేయాల్సిందే