మెగా ఈవెంట్స్‌కు అకీరా, ఆద్యలను మీరే పంపిస్తారా?.. రేణు దేశాయ్ ఆన్సర్ ఇదే
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:49 PM
మెగా ఫ్యామిలీలో జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు లేదా వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్యలు తప్పకుండా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారనే విషయం తెలియంది కాదు.
మెగా ఫ్యామిలీలో జరిగే పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు లేదా వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ (Akira Nandan), కుమార్తె ఆద్య (Aadya Konidela)లు తప్పకుండా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారనే విషయం తెలియంది కాదు. రీసెంట్‌గా జరిగిన సాయి దుర్గ తేజ్, కిరణ్‌ల నిశ్చితార్థ వేడుకలోనూ వారు కనిపించారు. వారిద్దరూ ఇలా మెగా ఈవెంట్స్‌లో కనిపించడానికి కారణం ఏంటో తాజాగా రేణు దేశాయ్ (Renu Desai) వివరించారు. ‘‘మెగా ఫ్యామిలీలో జరిగే పెద్ద పెద్ద ఈవెంట్ల (Mega Family Events)కు అకీరా, ఆద్య వెళ్లాలని మీరే చెబుతారా? లేక వాళ్లంతట వాళ్లే వెళ్తారా?’’ అని.. నటి రేణూ దేశాయ్‌కు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఎంతో స్పష్టంగా, భావోద్వేగంగా బదులిచ్చారు.
పిల్లలను ఆ ఫంక్షన్లకు పంపించడం వెనుక తన బాధ్యత ఉందని రేణూ దేశాయ్ స్పష్టం చేశారు. ‘‘ఖచ్చితంగా నేనే చెప్పి పంపించాలి.. ఎందుకంటే అది తల్లిగా నా బాధ్యత. సంస్కారాలు నేర్పించాల్సింది తల్లిదండ్రులే కదా! అక్కడ వ్యక్తిగతంగా చూసుకోవడానికి నేను ఉండను. ఒకవేళ నేనే స్వయంగా ఆ ఫంక్షన్‌లో ఉంటే పిల్లల ప్రవర్తనను దగ్గరుండి చూసుకునేదాన్ని. కానీ నేను లేనప్పుడు వాళ్లు ఒంటరిగా వెళ్తున్నారు కాబట్టి, వాళ్లకు అన్ని విషయాలు ముందుగానే చెప్పి పంపించాల్సిన బాధ్యత నాపైనే ఉంటుంది’’ అని ఆమె వివరించారు.
అంతేకాకుండా మన సమాజంలో పిల్లల పెంపకంపై ఉండే ఒత్తిడిని రేణూ దేశాయ్ ప్రస్తావించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘దురదృష్టం ఏమిటంటే.. మన దేశంలో పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినా.. ‘తల్లి సరిగ్గా పెంచలేదు, తల్లి పెంపకంలోనే లోపం ఉంది’ అంటూ నింద మొత్తం తల్లి మీదే వేస్తారు. ఈరోజు అకీరా, ఆద్య ఎంతో మంచిగా, పద్ధతిగా ఉన్నారు.. కానీ దానికి ఎవరూ నన్ను మెచ్చుకోరు. అదే పొరపాటున వాళ్లు ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రం నిందలన్నీ నాపైనే పడేవి. అందుకే వాళ్లకు చిన్నప్పటి నుంచే పద్ధతి, నిజాయితీ, సంస్కారాలు అలవడేలా శాయశక్తులా ప్రయత్నించాను’’ అంటూ పిల్లల పెంపకంపై తన మనసులోని ఆవేదనను, బాధ్యతను పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
తారక్ మా పెద్దబ్బాయ్.. చరణ్ నా తమ్ముడు: కింగ్
మూడోసారి విడాకులు?.. పవన్ కళ్యాణ్ మరో యుద్ధం చేయాల్సిందే
సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు టైటిల్ ఫిక్స్.. మరో హిట్ రాసిపెట్టుకోండమ్మా