సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

SS Rajamouli: ఏమైంది ఏమైంది... టికెట్‌ బుకింగ్‌ ఓపెన్‌ అయింది

ABN, Publish Date - Jun 11 , 2026 | 09:44 AM

లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘సింగ్‌ గీతం’ సినిమా టీమ్ కు ఎస్ ఎస్ రాజమౌళి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

SS Rajamouli - Sing Geetham

లెజెండరీ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు (Sing geetham) దర్శకత్వం వహించిన చిత్రం ‘సింగ్‌ గీతం’. వైజయంతి ఫిల్మ్స్‌, స్వప్న సినిమాస్‌ బ్యానర్లపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా మొదలయ్యాయి. దీనిపై దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ‘సింగ్‌ గీతం’ సినిమా మొదటి టికెట్‌ను ఆన్‌లైన్‌లో ఆయనే కొనుగోలు చేశారు.

అయితే దీనికి ముందు నాగ్‌ అశ్విన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ రాజమౌళికి వీడియో కాల్‌ చేసి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయించాలని ప్లాన్‌ వేశారు. అప్పటికే రాజమౌళి టికెట్‌ బుక్‌ చేసి సింగీతం శ్రీనివాసరావు విజన్‌పై తనకున్న అపారమైన గౌరవాన్ని రాజమౌళి చాటుకున్నారు. ఈ క్రేజీ మూమెంట్‌ను చూసి నాగ్‌ అశ్విన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ షాక్‌ అయ్యారు. సంబంధిత వీడియోను వైజయంతి ఫిల్మ్స్‌ సోషల్‌ మీడియాలో షేర్  చేసింది. ‘ఏమైంది ఏమైంది... టికెట్‌ బుకింగ్‌ ఓపెన్‌ అయింది’ అంటూ రాజమౌళి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ పాడుతున్న వీడియో వైరల్‌ అవుతోంది. రాజమౌళి స్వయంగా టికెట్‌ కొనడంతో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

Krishnam Raju: ఆరు పదుల.. రెబల్ స్టార్!

బుట్టబొమ్మకి తప్పని ‘ఐరన్ లెగ్’ శాపం..

Ravi Mohan: భార్య‌కు నెల‌కు రూ.40 ల‌క్ష‌ల భ‌ర‌ణం.. హీరో ర‌వి మోహ‌న్‌కు కోర్టులో చుక్కెదురు



Updated Date - Jun 11 , 2026 | 10:36 AM