Raasi: రాశీగారి ఫలాలు కాంట్రవర్సీ.. అనసూయ, రోజాపై మండిపడ్డ రాశీ
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:42 PM
నటుడు శివాజీ (Shivaji).. ఆడవారి డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెల్సిందే. ఇక ఈ కాంట్రవర్సీలోకి చిన్మయి, అనసూయ (Anasuya) కూడా వచ్చి చేరారు
Raasi: నటుడు శివాజీ (Shivaji).. ఆడవారి డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెల్సిందే. ఇక ఈ కాంట్రవర్సీలోకి చిన్మయి, అనసూయ (Anasuya) కూడా వచ్చి చేరారు. సాధారణంగా మునుమెన్నడూ తప్పు చేయనివారు.. ఇలాంటివాటి గురించి మాట్లాడితే ఓకే కానీ.. అనసూయ జబర్దస్త్ లో ఇలాంటి మాటలు ఎన్నో అంది. దీంతో అప్పటి వీడియోలను కొందరు తిరిగి పోస్ట్ చేస్తూ.. నువ్వేమైనా తిన్నగా ఉన్నావా .. ? శివాజీ ఇప్పుడు అన్నవి తప్పే అయితే.. గతంలో డబ్బు కోసం అదే పని నువ్వు చేయలేదా అంటూ వీడియోలతో సహా పోస్ట్ చేసి కడిగిపారేస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే అనసూయకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైపర్ ఆది స్కిట్ లో నువ్వు రాశీగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని అనసూయ అంటే.. ఆది అవి రాశీగారి ఫలాలు కాదు రాశిఫలాలు అని అంటాడు. ఈ డైలాగ్ లో చాలా పెద్ద బూతు ఉంది. ఇది రాశీ బొద్దుగా ఉందని, ఆమె బాడీని.. ప్రైవేట్ పార్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని రాసిన డైలాగ్ అని, అది కూడా పెద్ద బూతునే అని నెటిజన్స్ చెప్పుకొచ్చారు. ఇక ఆ డైలాగ్ విన్న జడ్జి రోజా కూడా నవ్విందే తప్ప ఆ డైలాగ్ ఏంటి అని అడగలేదు.
తాజాగా రాశీ.. ఈ వీడియోపై స్పందించింది. తన యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. ' మైక్ దొరికితే ఏదో ఒకటి మాట్లాడేయాలని కాదు కానీ, నా గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. శివాజీ గారు మాట్లాడింది 100 % తప్పు అని అనను. హీరోయిన్స్ గురించి కాదు కానీ, అనుకోకుండా రెండు పదాలు అనుకోకుండా దొర్లాయి. దానికి సారీ కూడా చెప్పాడు. ఆయన గురించి కాదు కానీ, నా గురించి, నన్ను అనుకోకుండా ఇందులోకి లాగారు.
ఒక షో.. అందులో యాంకర్, జడ్జి మీకు బాగా తెలుసు. అక్కడినుంచి నాకొక కాల్ వచ్చింది. ప్రేయసి రావే స్కిట్ చేద్దామనుకుంటున్నాను మేడం.. మీరు చేయాలి అని అన్నారు. కొన్ని ఎపిక్స్ ని టచ్ చేయకూడదు. ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటుంది. చిన్నపిల్లలందరూ నన్ను గుర్తుపడుతున్నారు అంటే ప్రేయసి రావే వలనే. స్కిట్ అంటే అన్నింటిలానే కామిక్ గానే తీస్తారేమో.. వద్దండి.. నేను చేయను అని చెప్పాను. జడ్జిగా రమ్మంటే వస్తానేమో కానీ, దాని సీక్వెల్ చేయమంటే మాత్రం చేయలేనని చెప్పాను. ఇక్కడితో ఆ విషయం అయ్యిపోయింది.
ఆ తరువాత వారు ఒక స్కిట్ చేశారు. రాశిఫలాలు అనే పదానికి ఆ యాంకర్ రాశీగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని అడిగింది. ఒక మహిళ.. అలా ఎలా అడుగుతుంది. నేను అది గమనించలేదు. ఇప్పుడు ఆ యాంకర్ బాగా మాట్లాడుతుంది. రాశిఫలాల్లో నేను లేను. రాశీ నా పేరు కాదు నా పేరు విజయలక్ష్మీ. అందులో నేను లేను. కానీ రాశీగారులో నేను ఉన్నాను. ఆ మాట అన్నాక జడ్జి కూడా హహ్హహా అని నవ్వింది. నేను ఆ ప్లేస్ లో ఉంటే నవ్వను. ఆ స్కిట్ ని ఆపేసి ఏంటండీ.. ఏంటి డైలాగ్ అని అడిగేదాన్ని.
కామిక్ చేయొచ్చు కానీ బాడీ షేమింగ్ చేయడానికి కన్నతల్లితండ్రులకు కూడా హక్కు లేదు. నేను సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను, టీవీ చాలా తక్కువ చూస్తాను అని చెప్తే నమ్మరు. యాటిట్యూడ్ చూపిస్తుంది అంటారు. నేను జెండర్ గురించి మాట్లాడడం లేదు.. అందరికీ చెప్తున్నా.. ఎందరో పాజిటివ్ గా ఉండండి. ఎందుకు గొడవలు. ఇలాంటి వివాదాల వలన సోషల్ మీడియాను మిస్ యూజ్ చేస్తున్నారు. నచ్చినవాళ్ళతో మాట్లాడండి.. నచ్చనివాళ్లను వదిలేయండి. ఎవరిని ట్రోల్ చేద్దామా.. ఎవరిని ఏం అందామని.. నేను ఈ విషయాన్నీ లీగల్ చేద్దామనుకున్నా.. మా అమ్మ ఎందుకు ఇది అని అనేసరికి ఆగిపోయాను ' అంటూ చెప్పుకొచ్చింది.