సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పూరి జగన్నాథ్‌ మ్యాజిక్ రిపీట్‌ అవుతుందా!?

ABN, Publish Date - Apr 20 , 2026 | 04:13 PM

పూరి జగన్నాథ్‌ సినిమా తీస్తే బాక్సాఫీస్ మైండ్ బ్లాక్ కావాల్సిందే. లోకల్ అయినా, నేషనల్ అయినా డైలాగ్ రీసౌండ్ చేయాల్సిందే. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆయన 'బద్రీ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రంతో ఆడియెన్స్ ను తనదైన మ్యాజిక్ తో మెస్మరైజ్ చేశారు. ఆ తర్వాత పలు ఇండస్ట్రీ హిట్స్ ను పూరి అందించారు. అయితే ఈ మధ్యలో కాస్తంత వెనకపడ్డారు. పూరి జగన్నాథ్‌ మళ్లీ కమ్ బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్న వేళ... అప్ కమింగ్ మూవీ హీరో చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి.

ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ది ప్రత్యేక స్టైల్. బోల్డ్ కంటెంట్ ను సైతం ఆడియెన్స్ కు ధైర్యంగా ఇంజెక్ట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే అందరూ ఆయన్ను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అని చెప్పుతుంటారు. హీరోలకు సరికొత్త లుక్, కొత్త క్యారెక్టర్లు ఇచ్చి, వారిని పూర్తిగా మార్చేసే మ్యాజిక్ ఆయనదే. తాజాగా తన సినీ ప్రయాణంలో 26 ఏళ్లు పూర్తి చేసుకున్నారు పూరి జగన్నాథ్‌. ఈ సందర్భంగా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఎమోషనల్ గా అభినందనలు తెలిపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ఎమోషనల్ నోట్‌లో విజయ్ సేతుపతి, పూరీతో కలసి పని చేసిన జ్ఞాపకాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇద్దరి కాంబినేషన్‌లో రాబోయే చిత్రం 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' షూటింగ్ సమయంలో పూరి చూపిన డెడికేషన్, కలుపుగోలుతనం , సృజనాత్మకతను సేతుపతి ప్రత్యేకంగా అభినందించారు.

కేవలం కమర్షియల్ సినిమాల్లో తన మార్క్ చూపడమే కాకుండా, తన హీరోల పాత్రల చిత్రీకరణలో పూరి చూపే వైవిధ్యం ఆయనను ఒక ప్రత్యేక స్థానంలో నిలుపుతోందని సేతుపతి అభిప్రాయపడ్డారు. 26 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.. మొండిగా ముందుకు సాగడం పూరికే సాధ్యమని విజయ్‌ సేతుపతి చెప్పారు. ఈ సందర్భంగా ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ సెట్ నుంచి కొన్ని ఆసక్తికరమైన వర్కింగ్ స్టిల్స్‌ను కూడా విజయ్ సేతుపతి అభిమానులతో పంచుకున్నారు. ఈ ఎమోషనల్ నోట్, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'స్లమ్‌ డాగ్‌ - 33 టెంపుల్‌ రోడ్‌' మూవీలో సంయుక్త కీలక పాత్రను పోషించింది. త్వరలో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా తిరిగి పూరి జగన్నాథ్‌ ను సక్సెస్ ట్రాక్‌ ఎక్కిస్తుందేమో చూడాలి.

Read Also: Chiranjeevi: ఆపదలో ఉన్న సిబ్బందికి అండగా మెగాస్టార్‌

Read Also: ఒకే ఇతివృత్తంతో రెండు చిత్రాలు

Updated Date - Apr 20 , 2026 | 05:13 PM