Chiranjeevi: ఆపదలో ఉన్న సిబ్బందికి అండగా మెగాస్టార్‌

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:39 PM

ఆపద అంటే ఆదుకోవడానికి మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ఎప్పుడూ ముందుంటారు. ఆయన సేవా గుణం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఆపద అంటే ఆదుకోవడానికి మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ఎప్పుడూ ముందుంటారు. ఆయన సేవా గుణం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కష్టమని తలుపు తడితే ఆపన్న హస్తం అందించడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు చిరు. ఆపదలో ఉన్న తన సిబ్బందిని ఆదుకున్నారు. మేకప్‌ ఆర్టిస్ట్‌ శివనాథ్‌ హార్ట్‌ సర్జరీ కోసం రూ.10.5 లక్షలు, మాజీ మేనేజర్‌ నరసయ్య సతీమణి బైపాస్‌ సర్జరీకి రూ.9.5 లక్షలు అందించి, వారంలోనే రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశారు.

అంతేకాదు ఇద్దరికీ సర్జరీ ఏర్పాట్లు స్వయంగా ఆయనే చూసి ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తనకు అందజేసిన ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు నగదు బహుమతి రూ. 10 లక్షలను చిరంజీవి పలు సేవా సంస్థలకు విరాళంగా అందజేశారు. ఇటీవల తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యుల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం రూ. 5లక్షలు విరాళంగా అందించిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 20 , 2026 | 04:18 PM