Committee kurrollu: కథా బలమే అవార్డులు తెచ్చింది
ABN, Publish Date - Jul 22 , 2026 | 04:52 PM
'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ మేకప్ విభాగాల్లో రెండు జాతీయ పురస్కారాలు లభించడం పట్ల నిర్మాత ఫణి అడపాక ఆనందం వ్యక్తం చేశారు.
'కమిటీ కుర్రోళ్లు' (Committee Kurrollu) చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ మేకప్ విభాగాల్లో రెండు జాతీయ పురస్కారాలు (National awards) లభించడం పట్ల నిర్మాత ఫణి అడపాక ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 'కమిటీ కుర్రోళ్లు' చిత్రం రెండు అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా చిత్రం నిర్మాతల్లో ఒకరైన ఫణి అడపాక మాట్లాడుతూ 'సిద్ధార్థ్ రాయ్' సినిమాతో నిర్మాతగా నా ప్రయాణాన్ని ప్రారంభించాను. తొలి సినిమాతో ఎంతో విలువైన అనుభవాన్ని సొంతం చేసుకున్నాను. ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తో కలిసి 'కమిటీ కుర్రోళ్లు' వంటి మంచి కథ, బలమైన భావోద్వేగాలు కలిగిన చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా సినిమా రెండు జాతీయ అవార్డులు అందుకోవడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోంది. ఒక నిర్మాతగా ఇది నాకు ఎంతో గర్వకారణమైన క్షణం. మా చిత్రాన్ని ఇంత గొప్ప స్థాయిలో గుర్తించి జాతీయ స్థాయిలో సత్కరించడం మొత్తం టీమ్ కష్టానికి దక్కిన గొప్ప గుర్తింపు. ప్రస్తుతం ఈటివి విన్ తో కలిసి మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులను రూపొందిస్తున్నాం. ఈ జాతీయ అవార్డులు మాపై మరింత బాధ్యతను పెంచాయి. భవిష్యత్తులోనూ మంచి కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించే సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తూ, తెలుగు సినిమా స్థాయిని మరింత ఉన్నతంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాం' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
దర్శకుడు మెహెర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం
స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ!
బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే...