సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘కల్కి 2’ షూటింగ్‌పై అప్‌డేట్.. సాయిపల్లవి ఎంట్రీపై టాక్

ABN, Publish Date - Oct 17 , 2026 | 02:28 PM

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలియంది కాదు.

Kalki 2 Update

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సీక్వెల్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్‌ను నిర్మించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘కల్కి 2’ షూటింగ్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో కొన్ని బిగ్ అప్‌డేట్స్ వైరల్ అవుతున్నాయి.


గతంలో అక్టోబర్ రెండో వారంలో ‘కల్కి 2’ (Kalki 2) చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువస్తామని దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ నేటి (అక్టోబర్ 17) నుంచే ప్రారంభమైనట్లుగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. హైదరాబాద్‌లోనే అత్యంత భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారని, ఈ షెడ్యూల్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ఉన్న హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను మించి, సీక్వెల్‌లో విజువల్స్ ఉండబోతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించి మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారట. నవంబర్ నుంచి వచ్చే ఏడాది వరకు కీలకమైన టాకీ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, 2028లో ఈ మూవీని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయానికే సెకండ్ పార్ట్‌కి సంబంధించిన చాలా పనులు జరగడంతో, అనుకున్న టైమ్‌లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందని టాక్ వినిపిస్తోంది.


మరోవైపు ఈ సినిమాలోని క్యాస్టింగ్ గురించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మొదటి భాగంలో ‘సుమతి’ పాత్రలో నటించిన దీపికా పదుకొణె ఈ సీక్వెల్ నుంచి తప్పుకోవడంతో, ఆమె స్థానంలో నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తలపై వైజయంతీ మూవీస్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. కల్కి అవతారానికి జన్మనిచ్చే తల్లిగా దీపికా పాత్ర చుట్టూ ఫస్ట్ పార్ట్ నడవగా.. ఇప్పుడు ఆ పాత్రను సాయిపల్లవితో రీప్లేస్ చేస్తున్నారా? లేక సీక్వెల్‌లో కల్కి రక్షణ కోసం వచ్చే మరో పవర్‌ఫుల్ మైథలాజికల్ క్యారెక్టర్‌గా సాయిపల్లవి కనిపించబోతున్నారా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ విజువల్ వండర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, ఎలాంటి ట్విస్ట్‌లతో ఉంటుందో తెలియాలంటే మాత్రం మేకర్స్ నుంచి అప్‌డేట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి:

దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?

‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

కావ్య మారన్‌తో పెళ్లి.. తెలుగువాళ్లకి అనిరుధ్ మరింత దగ్గర కాబోతున్నాడా?

Updated Date - Oct 17 , 2026 | 02:28 PM