అడ్డంకులు అధిగమించి 'పిఠాపురంలో... అలా మొదలైంది'!
ABN , Publish Date - Sep 07 , 2026 | 06:22 PM
మహేశ్ చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'పిఠాపురంలో... అలా మొదలైంది' సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతోంది. ఈ నెల 18న సినిమాను జనం ముందుకు తీసుకు రాబోతున్నారు.
'ప్రేయసిరావే' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చంద్రమహేశ్ ఆ తర్వాత 'అయోధ్య రామయ్య, చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా, ఒక్కడే' వంటి చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. కొంత కాలం గ్యాప్ తర్వాత ఆయన మహేశ్ చంద్ర పేరుతో 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రాన్ని రూపొందించారు. ఈ యేడాది మే 1న విడుదల కావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో ఆగిపోయింది. అయితే ఇప్పుడు అడ్డంకులను అధిగమించి, ఇదే నెల 18న దీనిని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మూడు విభిన్న ప్రేమ కథలతో ‘పిఠాపురంలో’ చిత్రాన్ని మహేశ్ చంద్ర తెరకెక్కించారని, యువత మనోభావాలను చక్కగా ఆవిష్కరించారని, యువతతో పాటు తల్లిదండ్రులు సైతం చూడాల్సిన సినిమా ఇదని మేకర్స్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Bipasha Basu: ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న బ్లాక్ బ్యూటీ
Varanasi: రాజమౌళి ఎక్కడా.. తగ్గడం లేదుగా
January 12 Vidudala: అనిల్ రావిపూడికి.. కొత్త టెన్షన్!
ఇక.. ఒక్కరైనా సీట్లో కూర్చుంటే ఒట్టు