గిల్‌ కాదు.. సారా టెండూల్కర్ పెళ్లాడేది ఆ హీరోనా?

ABN , Publish Date - Nov 20 , 2026 | 10:03 PM

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాయి. తాజాగా ఆమె పెళ్లికి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది.

Sara Tendulkar and Rajveer Deol

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) గారాలపట్టి సారా టెండూల్కర్ (Sara Tendulkar) ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాయి. మొన్నటి వరకు భారత క్రికెట్ కెప్టెన్ శుభమన్ గిల్‌ (Shubman Gill)తో సారా డేటింగ్‌లో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలకు బ్రేక్ పడుతూ, ఇప్పుడు బాలీవుడ్ వర్గాల నుంచి ఒక ఊహించని, సంచలన వార్త బయటకు వచ్చింది. బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ చిన్న కుమారుడు, యువ హీరో రాజ్‌వీర్ డియోల్‌తో సారా టెండూల్కర్ వివాహంపై చర్చలు జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.


బాలీవుడ్ ఇన్‌సైడ్ వర్గాలు, సన్నీ డియోల్ (Sunny Deol) టీమ్‌కు చెందిన అత్యంత సన్నిహితుల సమాచారం ప్రకారం.. ఇటీవల జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో రాజ్‌వీర్ డియోల్ (Rajveer Deol), సారా టెండూల్కర్ కలుసుకున్నారట. ఆ పరిచయం కాస్తా ఇరు కుటుంబాల మధ్య పెళ్లి (Sara Tendulkar and Rajveer Deol Marriage) ప్రస్తావన వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ పెళ్లి చర్చలు కార్యరూపం దాల్చితే, భారతదేశంలోని రెండు అత్యంత ప్రతిష్టాత్మకమైన దిగ్గజ కుటుంబాలు (ఒకవైపు సినీ దిగ్గజం ధర్మేంద్ర - సన్నీ డియోల్ కుటుంబం, మరోవైపు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబం) ఒక్కటైనట్లవుతుంది.


ప్రస్తుతం రాజ్‌వీర్ డియోల్‌తో సారా టెండూల్కర్ వివాహం అనే వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. నిన్నమొన్నటి వరకు శుభమన్ గిల్ పేరుతో వినిపించిన సారా పేరు, ఇప్పుడు అనూహ్యంగా డియోల్ కుటుంబంతో ముడిపడటంతో అటు క్రికెట్ అభిమానులు, ఇటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో మరో అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్ జరగబోతోందా అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే, ఈ పెళ్లి వార్తలపై అటు టెండూల్కర్ కుటుంబం గానీ, ఇటు డియోల్ కుటుంబం గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

డౌట్స్‌లో ‘గాడ్ ఆఫ్ వార్’.. త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ఎవరితో..

బాలీవుడ్‌కు ‘గరుడవేగ’ అంజి.. ‘అన్ఎక్స్‌పెక్టెడ్’

‘మాతృభూమి’ కోసం సల్మాన్, చిత్రాంగద హైదరాబాద్‌లో సందడి

Updated Date - Nov 20 , 2026 | 10:03 PM

Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

Sachin : క్రికెట్ గాడ్ తో తమన్... ఏం చేయబోతున్నాడు...

Sachin Tendulkar: మురళీధరన్ జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి

Sunny Deol New Movie: నటుడిగా నాకు సవాల్‌ విసిరే పాత్ర

Sunny Deol: ఆ ఇద్దరు నిర్మాతలకు చెయ్యిచ్చిన సన్నీ డియోల్