సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘పెద్ది’ కోసం చిరు.. మెగా సంబరాలు మొదలు!

ABN, Publish Date - Jun 12 , 2026 | 07:31 PM

‘పెద్ది’ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకుని మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ‘పెద్ది’ చిత్రం సాధించిన భారీ విజయాన్ని కొనియాడుతూ.. టీమ్‌ని ఎంతగానో అప్రిషియేట్ చేశారు.

Chiranjeevi with Peddi Team

కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించడంలో టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం మరోసారి ‘పెద్ది’ విషయంలో నిజమైంది. తాజాగా భారీ అంచనాలతో వచ్చి, థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). కేవలం ప్రేక్షకుల ఆదరణే కాకుండా, ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది. మంచి సినిమాలను ప్రమోట్ చేయడానికి ముందుండే చిరంజీవి, సక్సెస్ అయిన సినిమాల టీమ్‌ని ఇంటికి పిలిపించుకుని మరీ అభినందిస్తుంటారనే విషయం తెలియంది కాదు. అందులోనూ ఇప్పుడు తన కుమారుడికి పెద్ద విజయం దక్కడంతో, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఆ ఆనందాన్ని తెలియజేసేందుకు.. ‘పెద్ది’ చిత్రబృందాన్ని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకుని అభినందనలు తెలియజేశారు. ‘పెద్ది’ చిత్రం సాధించిన భారీ విజయాన్ని కొనియాడుతూ.. టీమ్‌ని ఎంతగానో అప్రిషియేట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మెగాస్టార్ తన నివాసంలో ‘పెద్ది’ చిత్ర దర్శకుడు, నిర్మాత, ఇతర సాంకేతిక నిపుణులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారందరికీ బొకేలు అందించి, అభినందించారు. సినిమా కథాంశం, నటీనటుల పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ టేకింగ్.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చిరు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ టీమ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ వంటి లెజెండరీ యాక్టర్ నుంచి ఇలాంటి ప్రశంసలు దక్కడంతో చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ పిక్స్ చూసి మెగా ఫ్యాన్స్ అండ్ సినీ లవర్స్.. ‘ఇది కదా అసలైన సక్సెస్ అంటే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


వాస్తవానికి ‘పెద్ది’ విడుదల టైమ్‌లో చిరంజీవి తన మెగా158 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. విడుదలను పురస్కరించుకుని టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తను పొల్లాచ్చి షూట్‌లో ఉన్న సమయంలో కూడా ‘పెద్ది’ సినిమా గురించే ఆలోచిస్తున్నట్లుగా తెలిపారు. ఇక ‘పెద్ది’ సక్సెస్‌‌తో చాలా సంతోషంగా ఉన్న చిరంజీవి.. టీమ్ అందరికీ తన ఇంట్లో శుక్రవారం రాత్రి సక్సెస్ పార్టీ ఇవ్వబోతున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇదంతా చూస్తుంటే.. తనయుడి సినిమా సక్సెస్‌తో చిరంజీవి చాలా హ్యాపీగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఎందుకంటే, రామ్ చరణ్ (Ram Charan) ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని ఆయన దగ్గరుండి చూశారు. ఆ కష్టానికి తగిన ఫలితం లభించినందుకు చిరు ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!

ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా

నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ

Updated Date - Jun 12 , 2026 | 07:31 PM