సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌కు హీరోయిన్ ఫిక్సయిందా? తెరపైకి మరో బ్యూటీ పేరు!

ABN, Publish Date - Apr 20 , 2026 | 09:38 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా స్పెషల్ సాంగ్ విషయంలో మరో హీరోయిన్ పేరు వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ పాట విషయంలో పలువురు హీరోయిన్ల పేరు వినిపించిన విషయం తెలిసిందే.

Peddi Special Song Update

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 27, ఏప్రిల్ 30 విడుదల అంటూ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కూడా రెండు సార్లు వాయిదా పడింది. అయితే ఈ జాప్యానికి ప్రధాన కారణం సాంకేతిక ఇబ్బందులు కాదని, సినిమాలో ఉండబోయే ఒక కీలకమైన స్పెషల్ సాంగ్ అని ఫిల్మ్ నగర్ టాక్. సెట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నా, ఆ పాటలో రామ్ చరణ్‌తో ఆడిపాడే సరైన కథానాయిక ఇంకా దొరకకపోవడమే ఈ ఆలస్యానికి అసలు కారణంగా తెలుస్తోంది.


ఈ ప్రత్యేక గీతం కోసం తొలుత మృణాల్ ఠాకూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పటివరకు క్లాస్, పద్ధతైన పాత్రలతో మెప్పించిన మృణాల్, ‘పెద్ది’ సినిమాలో మాస్ స్టెప్పులు వేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని ప్రేక్షకులంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే నటి కోసం అన్వేషణ మళ్ళీ మొదటికొచ్చింది. ఆ తర్వాత మిస్ ఇండియా మానస వారణాసి పేరు తెరపైకి వచ్చినప్పటికీ, భారీ మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సాంగ్‌లో ఆమె గ్రేస్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్ రేసులోకి మరో బ్యూటీ వచ్చింది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు ‘అఖండ 2, బింబిసార, విరూపాక్ష’ వంటి సినిమాల్లో నటించిన నటి సంయుక్త (Samyuktha). హిట్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త, ఈ మాస్ సాంగ్‌కు న్యాయం చేయగలదా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. సమంత లేదా పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు గతంలో చేసిన ఐటమ్ సాంగ్స్ సృష్టించిన ప్రభావాన్ని సంయుక్త అందుకోవాలంటే.. ఆమె తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది.


మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు మాత్రం రొటీన్ స్టార్స్ వెంట పడకుండా, ప్రేక్షకులను థ్రిల్ చేసే సరికొత్త కాంబినేషన్ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆలోచనా విధానం గతంలో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాను గుర్తుచేస్తోంది. అప్పట్లో కొత్తవారితోనే మ్యాజిక్ చేసిన ఆయన, ఇప్పుడు కూడా ఏదో ఒక వైవిధ్యమైన ప్రయోగం చేయాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. స్పెషల్ సాంగ్ కోసం కేవలం గ్లామర్‌నే కాకుండా, డ్యాన్స్‌లో రామ్ చరణ్‌తో పోటీ పడగల సత్తా ఉన్న నటిని ఎంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ నిర్ణయం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుందనేది ఆయన నమ్మకం. దీంతో బుచ్చిబాబు ఈ విషయంలో ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తారా? అని ఫ్యాన్స్ అంతా వేచి చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

అప్పటి వరకూ నాకు విశ్రాంతి లేదు: పవన్ కళ్యాణ్ విష్‌కు చంద్రబాబు స్పందనిదే!

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి సినిమాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు వీరే!

సబ్‌స్క్రిప్షన్ వార్తలపై అనన్య నాగళ్ల క్లారిటీ ఇదే!

Updated Date - Apr 20 , 2026 | 09:38 PM