GDN: ‘జీడీఎన్‌’ వచ్చేది ఎప్పుడంటే..

ABN , Publish Date - Jul 22 , 2026 | 09:37 AM

ఇండియన్‌ ఎడిసన్‌గా గుర్తింపు పొందిన జీడీ నాయుడు జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘జీడీఎన్‌’ పేరుతో రూపొందించిన చిత్రం విడుదల మరోమారు వాయిదా పడింది.

ఇండియన్‌ ఎడిసన్‌గా గుర్తింపు పొందిన జీడీ నాయుడు (GD naidu) జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘జీడీఎన్‌’ (GDN) పేరుతో రూపొందించిన చిత్రం విడుదల మరోమారు వాయిదా పడింది. మేకర్స్‌ ముందుగా నిర్ణయించినట్టుగా ఈ నెలలో విడుదల కావాల్సివుంది. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’  ఈ నెల 23న విడుదల చేయనున్నట్టు నిర్మాత వెంకట్‌ కె.నారాయణ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ నెల 24వ తేదీన విడుదల కావాల్సిన అనేక చిత్రాలు వాయిదాపడ్డాయి.

ఈ నేపథ్యంలో ఆర్‌.మాధవన్‌, దుషార విజయన్‌ జంటగా నటించిన ‘జీడీఎన్‌’ ఆగస్టు 7న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ బయోగ్రఫీ తర్వాత వర్గీస్‌ మూలన్‌ పిక్చర్స్‌, ట్రై కలర్‌ ఫిలిమ్స్‌ సంయుక్తంగా తమిళం, తెలుగు, హిందీతో సహా పలు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాయి. గోవింద్‌ వసంత్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ఆర్‌.మాధవన్‌, సత్యరాజ్‌, జయరాం, ప్రియమణి, దుషార విజయన్‌, వినయ్‌ రాయ్‌, తంబి రామయ్య, నందలాల్‌, షీల, కరుణాకరన్‌, అదితి బాలన్‌, మోహన్‌ రామన్‌ తదితరులు నటించారు.

ALSO READ:

స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ
బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే

పెళ్లి తరువాత అక్కినేని కోడలు రీఎంట్రీ.. ఆ హీరోతో రొమాన్స్




Updated Date - Jul 22 , 2026 | 10:06 AM