పవన్ కళ్యాణ్ హెల్త్‌పై ప్రధాని మోదీ, చిరంజీవి ట్వీట్స్ వైరల్
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:31 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరిగినట్లుగా అధికారికంగా పార్టీ వర్గాలు తెలిపాయి! పవన్ కళ్యాణ్ వైఫ్ కూడా సర్జరీ సక్సెస్ అయిందని, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) సర్జరీ జరిగినట్లుగా అధికారికంగా పార్టీ వర్గాలు తెలిపాయి! పవన్ కళ్యాణ్ వైఫ్ కూడా సర్జరీ సక్సెస్ అయిందని, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరిగిందని తెలిసి.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
‘‘ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. ఆయన అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘కళ్యాణ్ బాబుకి వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఆయన ఇప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు, ఆయన తిరిగి నార్మల్ స్టేజ్‌కు చేరుకోవడానికి సుమారు ఒక వారం సమయం పట్టవచ్చు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు. ఆయన త్వరగా కోలుకోవాలని, తిరిగి పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం’’ అని చిరంజీవి పోస్ట్ చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు మరింత దృఢంగా, ఉత్సాహంగా తిరిగి ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నాను’’ అని రామ్ చరణ్ (Ram Charan) ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అల్లు అర్జున్ (Allu Arjun) ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా సినీ, రాజకీయ ప్రముఖులెందరో పవన్ కళ్యాణ్ కోలుకుని, ఎప్పటిలానే తన మార్క్ పాలన అందించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Raasi: మహేష్ ‘నిజం’ సినిమాలోని పాత్రపై రాశి షాకింగ్ కామెంట్స్!
పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?
విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.