సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

థియేటర్లలో ముగిసి.. ఓటీటీకి వచ్చాకా ట్రోలింగ్! దర్శకులకు నిద్రలేని రాత్రులు

ABN, Publish Date - Oct 24 , 2026 | 01:30 PM

ఒకప్పుడు సినిమా ఫలితం తేలడానికి కనీసం వారం రోజులు పట్టేది. సినిమా బాలేకపోతే ప్రేక్షకులు సైలెంట్‌గా థియేటర్ల నుంచి వెళ్లిపోయేవారు, నెమ్మదిగా ఆ సినిమా ప్రభావం తగ్గిపోయేది.

Trolling on Directors

ఒకప్పుడు సినిమా ఫలితం తేలడానికి కనీసం వారం రోజులు పట్టేది. సినిమా బాలేకపోతే ప్రేక్షకులు సైలెంట్‌గా థియేటర్ల నుంచి వెళ్లిపోయేవారు, నెమ్మదిగా ఆ సినిమా ప్రభావం తగ్గిపోయేది. కానీ నేటి డిజిటల్ యుగంలో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సినిమా ఫస్ట్ షో ప్రీమియర్ పడటమే ఆలస్యం.. సోషల్ మీడియాలో ట్రోలర్లు వేట మొదలుపెట్టేస్తున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయితే దర్శకులు ఎదుర్కొంటున్న మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. థియేట్రికల్ రన్ ముగిసి దర్శకులు ఆ బాధ నుంచి తేరుకుంటున్న సమయంలో.. ఓటీటీ రిలీజ్ రూపంలో వారికి రెండో విడత నరకం మొదలవుతోంది.


థియేటర్లలో విడుదలైనప్పుడు భారీ హైప్, పెంచిన టికెట్ ధరల కారణంగా ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొని డిప్రెషన్‌లోకి వెళ్లిన దర్శకులకు.. ఓటీటీ స్ట్రీమింగ్ మరో పీడకలగా మారుతోంది. సినిమా ఓటీటీలోకి రాగానే హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను చేతుల్లోకి తీసుకుంటున్న మీమర్స్, నెటిజన్లు మరింత రెట్టించిన ఉత్సాహంతో ట్రోల్స్ స్టార్ట్ చేస్తున్నారు. థియేటర్లలో ఎవరూ పెద్దగా గమనించని చిన్న చిన్న లోపాలు, లాజిక్ లెస్ సీన్లు, వీఎఫ్‌ఎక్స్ బ్లండర్లను ఫ్రేమ్ టు ఫ్రేమ్ కట్ చేసి ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వేదికల్లో విపరీతంగా విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన ‘ఎపిక్’, ‘ద ప్యారడైజ్’ చిత్రాలు ఇందుకు తాజా ఉదాహరణలుగా నిలిచాయి. ముఖ్యంగా ‘ద ప్యారడైజ్’ విషయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఎదుర్కొంటున్న ట్రోలింగ్ తీవ్రత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంకా చెప్పాలంటే ఆయనకు నిజంగానే నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. తాజాగా ఈ సినిమా నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. సినిమా విడుదలైనప్పుడు వచ్చిన ట్రోలింగ్ కంటే.. ఇప్పుడు మరింత దారుణంగా సీన్ టు సీన్ కట్ చేసి మరీ విమర్శనాస్త్రాలను నెటిజన్లు సంధిస్తున్నారు. దీంతో ఆయనకు మరోసారి నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.


ఇలా.. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ దాడికి అత్యధికంగా బలవుతున్నది పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రాల దర్శకులే. ‘ఆదిపురుష్’ (Aadipurush)తో ఓం రౌత్, ‘ది రాజా సాబ్’ (The Raja Saab)తో మారుతి ఇప్పటికీ నెట్టింట ట్రోలర్ల టార్గెట్‌గా మిగిలిపోయారు. ఓం రౌత్ నెమ్మదిగా వార్తల నుంచి పక్కకు తప్పుకుంటున్నా, మారుతిని మాత్రం సోషల్ మీడియా అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. విచిత్రం ఏమిటంటే.. కేవలం ఫ్లాప్ అయిన సినిమాలే కాదు, థియేటర్లలో అద్భుతమైన హిట్లు కొట్టిన చిత్రాలను సైతం ఈ ట్రోలింగ్ బ్యాచ్ వదలడం లేదు. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ‘ఇరుముడి’ లాంటి సినిమా ఓటీటీలోకి వచ్చాక.. ‘ఏముందిరా దీంట్లో.. ఇంత లేపారు?’ అంటూ సినిమా విజయాన్ని, మేకింగ్‌ను కించపరిచే పోస్టులు దర్శనమిచ్చిన విషయం తెలియంది కాదు. ఒక సృష్టిని ఎంతో కష్టపడి తెరకెక్కించే దర్శకులకు.. సోషల్ మీడియా హద్దులు దాటి చేస్తున్న ఈ వ్యక్తిగత దూషణలు, కంటిన్యూయస్ ట్రోల్స్ నిజంగానే ఓ భయంకరమైన హారర్ మూవీని తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

మినిమమ్ సెన్స్ లేకుండా నెగిటివ్ చేయాలని చూశారు: ‘రణబాలి’ దర్శకుడు

ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీగా చేసింది ఎవరో తెలుసా?

ఈసారి ఊహించినట్లుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుంది.. ఏం చేశావ్ గురూజీ?

Updated Date - Oct 24 , 2026 | 01:30 PM