సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఒడియా హిట్‌ మూవీ ‘జడి’ తెలుగులోకి..

ABN, Publish Date - Oct 23 , 2026 | 11:08 AM

ఒడియాలో ఘన విజయం సాధించిన ‘జడి (What If)’ చిత్రాన్ని మెగా ప్రొడక్షన్స్ అధినేత ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ తెలుగులో అందిస్తున్నారు. కామెడీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రత్యేక తెలుగు గ్లింప్స్‌ విడుదలైంది. తెలుగు వెర్షన్ రిలీజ్‌ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.

Odia Movie Jadi

తెలుగు సినిమా రంగం అనువాద చిత్రాలకు అడ్డాగా మారుతోంది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలు తెలుగులో డబ్‌ అవుతూనే ఉంటాయి. స్ట్రయిట్‌ తెలుగు సినిమాలతో పోటీ పడుతూ, భారీ స్థాయిలో రిలీజ్‌ అవుతుంటాయి. చిత్రం ఏమంటే ఇప్పుడు ఒరియా సినిమాలు సైతం తెలుగులో డబ్బింగ్‌కు సిద్ధమౌతున్నాయి. అలా తెలుగు వారి ముందుకొస్తున్న తాజా చిత్రం 'జడి'.

ఒడియాలో ఘన విజయం సాధించిన ‘జడి (What If)’ చిత్రాన్ని మెగా ప్రొడక్షన్స్ అధినేత ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీయాన్ష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాజల్ రే నిర్మించిన ఈ చిత్రానికి దిబ్య జ్యోతి ఉదయ సింగ్ రచన, దర్శకత్వం వహించారు. సైలేంద్ర సమంతరాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా ప్రధాన పాత్రల్లో నటించగా.. సుశాంత్ దాస్ మహాపాత్ర, రబి మిశ్రా, బాలకృష్ణ నాయక్, కృష్ణ రౌత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం కామెడీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది.


తాజాగా తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కాలేజీ యువకుల మధ్య స్నేహం, అనుబంధాలతో ప్రారంభమై.. ప్రేమకథగా మారుతూ, స్నేహితుల మధ్య తలెత్తే విభేదాలు, సంఘర్షణలను ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. ప్రేమకథకు మించి జీవితంలోని విభిన్న భావోద్వేగాలు, బంధాలను ఈ చిత్రం ఆవిష్కరించనుంది. దర్శకుడు దిబ్య జ్యోతి ఉదయ సింగ్ గ్రామీణ వాతావరణం, యువత స్నేహాలు, ప్రేమ, సంఘర్షణలను సహజంగా తెరపై ఆవిష్కరించారు. రుద్రకాంత సింగ్ సినిమాటోగ్రఫీ గ్రామీణ అందాలను చూపించగా అభిషేక్ పనిగ్రాహి నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కు భావోద్వేగాలను జోడించింది. సోమేశ్ సత్పతి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. తెలుగు వెర్షన్‌కు రాకేందు మౌళి పాటలు, మాటలు రాశారు. ఈ చిత్రానికి మానస్ కుమార్ సాహూ ఎడిటర్‌గా వ్యవహరించారు. తెలుగు వెర్షన్ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Haiku Review: సినిమా రివ్యూ: హైకూ

‘నా వైఫ్ మిస్సింగ్’.. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ మూవీ ఎలా ఉందంటే?

నిజమైన హీరోలేనా.. లేక ‘డూప్’లా? ‘జైలర్ 2’తో మొదలైన కొత్త చర్చ

Updated Date - Oct 23 , 2026 | 11:24 AM