NTRNEEL: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ భామ స్పెషల్ సాంగ్?
ABN, Publish Date - May 03 , 2026 | 08:08 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపుదిద్దుకుంటోన్న సినిమా కోసం సినీ ప్రియులతో పాటు తారక్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఇదే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో రూపుదిద్దుకుంటోన్న సినిమా కోసం సినీ ప్రియులతో పాటు తారక్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘డ్రాగన్’ (Dragon) అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తన కెరీర్‌లోనే ఒక మాస్టర్ పీస్‌గా మలచాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆయన స్క్రిప్ట్ పనులకే సుదీర్ఘ సమయం కేటాయించడం విశేషం. ఇప్పటి వరకు వచ్చిన ప్రశాంత్ నీల్ సినిమాలన్నింటికంటే ఈ చిత్రం విజువల్స్ పరంగా, మేకింగ్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని సినీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు, ఆయన అద్భుతమైన డాన్స్ స్కిల్స్‌కు తగ్గట్టుగా సినిమాలో ఒక హై-వోల్టేజ్ ఐటెం సాంగ్ (Item Song)ను ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్‌లో తారక్‌తో కలిసి స్టెప్పులు వేయడానికి ఒక టాప్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను చిత్ర బృందం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉన్నప్పటికీ, ఈ వార్త తెలిసిన అభిమానులు మాత్రం ఆ డ్యాన్స్ ఫ్లోర్ షేక్ అవ్వడం ఖాయమని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో కాస్టింగ్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో మెరవబోతున్నారు. అనిల్ కపూర్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఇక ‘కెజియఫ్’ ఫేమ్ రవి బస్రూర్ తన సంగీతంతో ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లబోతున్నారు. ప్రతి సీన్ ఎలివేషన్ బాక్సాఫీస్ దగ్గర పూనకాలు తెప్పించేలా ఉండబోతోందని తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయేలా ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తున్నారు. కేవలం ఎలివేషన్లే కాకుండా, కథలో ఉండే ఎమోషన్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. వచ్చే ఏడాది జూన్ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్-ఇండియా స్థాయిలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ ఊరమాస్ యాక్షన్ తోడైతే థియేటర్లలో ఏ స్థాయి సంచలనం నమోదు అవుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?
ఒకే వేడుకలో చైతూ-శోభిత, సమంత-రాజ్ జంటలు హల్చల్!
‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!
కయాదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా?