సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘డ్రాగన్’ ఎన్టీఆర్ అసలైన లుక్ కోసం.. అప్పటి వరకు వెయిట్ చేయాలా?

ABN, Publish Date - Jun 07 , 2026 | 12:50 AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డ్రాగన్’. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

NTR Dragon Update

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man of Masses NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డ్రాగన్’ (Dragon). తారక్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ ప్రేక్షకులకు ఒక క్రేజీ ట్రీట్‌ను అందించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ గ్లింప్స్‌లో రివీల్ అయిన తారక్ లుక్‌కు మాస్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అటు ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్, ‘వార్-2’ అనంతరం ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్ ఈ చిత్రంపై కొండంత ఆశలు పెట్టుకున్నారు.


అయితే.. ప్రస్తుతం బయటకు వచ్చిన లుక్ కేవలం తారక్ లుగర్ వెర్షన్ మాత్రమేనని, అసలైన ‘డ్రాగన్’ లుక్ ఇంకా రివీల్ కాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఆ అసలు సిసలైన మాస్ లుక్ పైనే ఉంది. కాకపోతే, ఈ లుక్ కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే ఆ క్రేజీ డ్రాగన్ లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఎన్టీఆర్ అసలైన లుక్ చూడాలంటే మరో 6 నెలల పాటు ఓపిక పట్టాల్సిందే. ఇప్పటికే తారక్ ఈ సినిమా కోసం ఒక ఊరమాస్ మేకోవర్‌తో షాకిచ్చాడు. ఇక డిసెంబర్‌లో రాబోయే ఆ ‘డ్రాగన్’ వెర్షన్ లుక్ ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉంటుందోనని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు వేసేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని చెప్పవచ్చు. మరోవైపు ఆ లుక్ కోసమే మరో సినిమాకి సైతం ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడానికి కారణం అని టాక్ వినిపిస్తోంది. ఆ రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ తన సమయాన్ని కేటాయిస్తున్నారు.


మరోవైపు ‘డ్రాగన్’ రెండు పార్ట్ లుగా రానుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మేకర్స్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ కథను రెండు భాగాలగా విడుదల చేయాలని దర్శకుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘సలార్’ చిత్రానికి రెండు భాగాల మధ్య ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి ప్రశాంత్ నీల్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారట. ‘డ్రాగన్’ రెండు భాగాల మధ్య అస్సలు గ్యాప్ ఉండకూడదని ఆయన గట్టిగా డిసైడ్ అయ్యారట. అందువల్లనే మొదటి భాగం షూటింగ్ నడుస్తున్నప్పుడే, దానికి సమాంతరంగా రెండో భాగానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించేలా పక్కా ప్లాన్ సిద్ధం చేశారట. ‘డ్రాగన్’ పార్ట్ 1 వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాతి ఆరు నెలల లోపే, అంటే డిసెంబర్ 2027 నాటికి ‘డ్రాగన్ 2’ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజూ మీనన్, అశుతోష్ రాణా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండడం సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేస్తోంది. మరి ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!

ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!

సినిమా రివ్యూ: హీమాన్ అండ్‌ మాస్టర్స్ ఆఫ్ ది యూనివ‌ర్స్

Updated Date - Jun 07 , 2026 | 12:50 AM