ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. టోవినో థామస్ ఛాన్స్ పట్టేసిన హీరో అతనే!
ABN , Publish Date - May 21 , 2026 | 06:10 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. ఇందులో టొవినో థామస్ చేయాల్సిన పాత్రని దక్కించుకున్న నటుడిపై వార్తలు వైరల్ అవుతున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (Dragon). రీసెంట్‌గా తారక్ బర్త్‌డే స్పెషల్‌గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేయడమే కాకుండా, అందులోని పాత్రల ఇంటెన్సిటీతో సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది. ఈ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి, ఇందులో మలయాళ నటుడు టొవినో థామస్‌కు ప్రశాంత్ నీల్ ఆఫర్ చేసిన పాత్ర ఏమిటా? అని అంతా సెర్చ్ చేస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించి, అలాగే టొవినో చేయాల్సిన ప్లేస్‌లో ఏ హీరో చేశారనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ గ్లింప్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ‘బాబీ సర్కార్’ (Boby Sarkar) అనే పవర్‌ఫుల్ రోల్‌ను బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ గుప్తా పోషిస్తున్నారు. నిజానికి ఈ పాత్ర కోసం మొదట మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ (Tovino Thomas)ను సంప్రదించారట. కానీ, ఆయన ఇతర సినిమాల డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఆ లక్కీ ఛాన్స్ సిద్ధాంత్ గుప్తాను వరించింది.
ఈ చిత్రంలో సిద్ధాంత్ గుప్తా, ఎన్టీఆర్‌కు ఆన్-స్క్రీన్ బ్రదర్‌గా కనిపించబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. కేవలం తమ్ముడి పాత్రగానే కాకుండా, కథలో అత్యంత కీలకమైన ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’కి వజీర్‌గా ఆయన క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందట. ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్‌కు, సినిమాలోని ప్రధాన మలుపులకు ఈ పాత్రే కీలకం కానుందపి తెలుస్తోంది. గ్లింప్స్‌లో సిద్ధాంత్ లుక్ చూస్తుంటేనే ప్రశాంత్ నీల్ ఆయన క్యారెక్టర్‌ను ఎంత ఇంటెన్స్‌గా డిజైన్ చేశారో అర్థమవుతోంది. దాంతో నందమూరి అభిమానుల్లో ఈ కాంబోపై భారీ క్యూరియాసిటీ ఏర్పడింది.

సిద్ధాంత్ గుప్తా (Sidhant Gupta) విషయానికి వస్తే.. హిందీలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘జుబిలీ’ (Jubilee) వెబ్ సిరీస్‌తో పాటు ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ (Inside Edge)లో తన అద్భుతమైన నటనతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సిద్ధాంత్ గుప్తా. నటనకు స్కోప్ ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే ఈ టాలెంటెడ్ యాక్టర్, ఇప్పుడు ‘డ్రాగన్’ చిత్రంతో సౌత్ ఇండియాలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ లాంటి మాస్ పవర్‌హౌస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో.. ఈ సినిమాతో టాలీవుడ్‌తో పాటు సౌత్ మార్కెట్‌లో కూడా గట్టి ముద్ర వేయాలని సిద్ధాంత్ భావిస్తున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో?
ఇవి కూడా చదవండి:
‘లవ్ యూ కళ్యాణ్’.. మెగా158 లాంచ్‌పై చిరు ట్వీట్ వైరల్!
Drishyam 3: దృశ్యం 3 మూవీ రివ్యూ
చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!
Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!