Nithiin: సితారతో నితిన్.. కొబ్బరికాయ కొట్టేశారు
ABN, Publish Date - May 06 , 2026 | 03:13 PM
యంగ్ హీరో నితిన్‌కు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. గ్యాప్ లేకుండా సినిమాలైతే చేస్తున్నారు కానీ, హిట్ మాత్రం ఆయనకు రావడం లేదు. వరసగా పరాజయాలలో ఉన్నప్పటికీ నితిన్‌కు అవకాశాల విషయంలో మాత్రం లోటు లేదు.
యంగ్ హీరో నితిన్ (Nithiin)కు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. గ్యాప్ లేకుండా సినిమాలైతే చేస్తున్నారు కానీ, హిట్ మాత్రం ఆయనకు రావడం లేదు. వరసగా పరాజయాలలో ఉన్నప్పటికీ నితిన్‌కు అవకాశాల విషయంలో మాత్రం ఎటువంటి అడ్డంకి లేదు. పరాజయాల్లో ఉన్నప్పటికీ, నితిన్‌తో సినిమాలు చేసేందుకు ఎవరో ఒక నిర్మాత రెడీగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నితిన్ హీరోగా టాలీవుడ్ అగ్రగామి సంస్థలలో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) ఓ చిత్రం చేయబోతోంది. దర్శకులు నారి సిరిసవాడ, సోమశేఖర్ టి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించి సాంప్రదాయ పూజా కార్యక్రమాలు బుధవారం అధికారికంగా పూర్తయ్యాయి.
వాస్తవానికి సితారలో నితిన్ సినిమా అనగానే ముందు అంతా ఆశ్చర్యపోయారు. నితిన్ ట్రాక్ రికార్డ్ చూసి కూడా సితార బ్యానర్ సినిమా చేస్తుందంటే కచ్చితంగా ఇందులో విషయముందనే అర్థం చేసుకోవాలి. ‘మిరాయ్’ ఫేమ్ రితికా నాయక్ (Ritika Nayak) హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వంటి వారితో పాటు ప్రతిభావంతులైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ నిర్మాణ సంస్థల కలయికలో ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలు రావడంతో, ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా చిత్రీకరణ మే రెండో వారం నుంచి ప్రారంభం కానుందని, చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి.. షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నద్ధమవుతోందని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?
Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!
‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?