Nithiin: ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం..

ABN , First Publish Date - 2023-12-05T15:50:03+05:30 IST

నితిన్‌, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ అండ్ మూవీస్ బ్యానర్ల‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్.. ఈ సినిమాతో గట్టిగా కొట్టబోతున్నామని, అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమా ఇదని చెప్పుకొచ్చారు.

Nithiin: ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం..
Nithiin and Sreeleela

నితిన్‌ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man). వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ అండ్ మూవీస్ బ్యానర్ల‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో (Extra Ordinary Man Pre Release Event)

హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమా నాకు చాలా స్పెషల్. ఇంత వరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు వక్కంతం వంశీకి థాంక్స్. ఖ్యాతీ, రిత్విక్ పాత్రలతో ప్రేమలో పడతారు. ప్రతీ పాత్రకు ఇందులో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రాజశేఖర్ గారు చేసిన ‘మగాడు’ (Magadu) సినిమాతో మా నాన్న డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టారు. ఆ సినిమా హిట్ అయింది కాబట్టే మా నాన్న ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఉన్నాను. నా సినిమాలో రాజశేఖర్‌ (Rajasekhar)గారు స్పెషల్ రోల్ చేసినందుకు థాంక్స్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు.


Nithiin-Pic.jpg

హ్యారిస్ జైరాజ్‌గారు మంచి పాటలు ఇచ్చారు. ఆర్ఆర్ చాలా కొత్తగా ఉంటుంది. మా డీఓపీ యువరాజ్‌తో మూడు సినిమాలు చేశాను. నన్ను ఎలా చూపించాలో ఆయనకు తెలుసు. శ్రీలీల (Sreeleela) ఎంత బిజీగా ఉన్నా కూడా మాకు అవసరమైనప్పుడు డేట్స్ ఇచ్చారు. సినిమాలో నేను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ కానీ.. రియల్ లైఫ్‌లో శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్‌. నాకు, నా దర్శకుడికి ఈ సినిమా చాలా ముఖ్యం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. నిర్మాతలకు లాభాలు రావాలి. సినిమాను చూసి నా ఫ్యాన్స్, ప్రేక్షకులు అంతా కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు. డిసెంబర్ 8న గట్టిగా కొట్టబోతోన్నాం’’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Neha Shetty: సుట్టంలా వచ్చి.. ఇష్టసఖిగా మారుతోంది

***************************************

*‘బై వన్‌ టికెట్.. గెట్‌ వన్‌ ఫ్రీ’.. నిర్మాత బంపరాఫర్

*****************************************

*Charan Arjun: రేవంత్ రెడ్డి విజయం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది

***********************************

Updated Date - 2023-12-05T15:50:05+05:30 IST